Begin typing your search above and press return to search.

ఇద్దరు నటులు.. రెండు కంపెనీలు.. దుల్కర్ కెరీర్ లోనే ఫైనెస్ట్..!

దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించిన సినిమా కాంత. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను వేఫరర్ ఫిలంస్, స్పిరిట్ మీడియా కలిసి నిర్మించారు.

By:  Ramesh Boddu   |   15 Nov 2025 11:09 AM IST
ఇద్దరు నటులు.. రెండు కంపెనీలు.. దుల్కర్ కెరీర్ లోనే ఫైనెస్ట్..!
X

దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించిన సినిమా కాంత. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను వేఫరర్ ఫిలంస్, స్పిరిట్ మీడియా కలిసి నిర్మించారు. దుల్కర్ సల్మాన్ తో పాటు రానా ఈ సినిమాలో నటించడమే కాదు నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా కాంత మేకర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్ మీట్ లో రానా మాట్లాడుతూ.. కాంతా సినిమాకు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు. పర్ఫార్మెన్స్ పరంగా ట్రెమండర్స్ రెస్పాన్స్ వస్తుంది. దుల్కర్ కెరీర్ లోనే ఇది ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అన్నారు రానా. మ్యూజిక్, విజువల్స్ టెక్నికల్ వాల్యూస్ గురించి మంచి ప్రశంసలు వస్తున్నాయని అన్నారు రానా. టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూ ఉన్న సినిమా కాంత. ఈ సినిమాకు మీరు ఇచ్చిన సపోర్ట్ కు థాంక్యూ అని అన్నారు రానా.

సినిమాకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. జోనర్ బెండింగ్ సినిమాగా వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ కాంత. మద్రాస్ నేపథ్యంలో జరిగే కథ అవ్వడం తో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా చూడటంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారని అన్నారు రానా. ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై తన స్పందన తెలియచేసిన రానా ప్రెస్ మీట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇచ్చారు..

ఈ సినిమాను దుల్కర్ తో మీరు నిర్మించడానికి రీజన్ ఏంటి..?

నాకు కొలాబరేషన్ ఇష్టం.. ఇద్దరు నటులు రెండు కంపెనీలు ఒకచోట పనిచేస్తే అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇండిపెండెంట్ ఆర్ట్ సినిమా నాకు గుల్కర్ కి ఇష్టం. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉందని అన్నారు రానా. అంతేకాదు గ్యాప్ తర్వాత నేను స్క్రీన్ మీద కనిపించాను.. నా క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు రానా.

ఈ సినిమాలో దుల్కర్ అమేజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.. హీరో అంటే ఇన్ సెక్యూర్ అవ్వకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది.. కానీ దుల్కర్ ఆ ఎమోషన్ ని అద్భుతంగా పండించారని అన్నారు రానా. భాగ్య శ్రీ రోల్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమెకు బిగ్ కంగ్రాట్స్ అన్నారు రానా.

ఈ సినిమా సెట్స్ ని ఎలా చేశారు..?

చాలా వరకు రిఫరెన్స్లు తీసుకున్నాం. ఏవీఎం స్టూడియోస్, వాహిని స్టూడియోస్ నుంచి చాలా రిఫరెన్స్ లు తీసుకున్నాం. ఆ టైంలో సెట్లు ఎలా వేసే వారు అనేది ప్రతిదీ డీటైల్ గా డిజైన్ చేశాం. అలానే డైరెక్టర్ సెల్వ కి ప్రతి విషయంలో చాలా క్లారిటీ ఉంది. అందుకే ప్రతి ఫ్రేం పెయిటింగ్ గా ఉందని అన్నారు రానా.

కాంతా బయోపిక్ కాదన్నారు.. సినిమాలో ఎంజీఆర్. ఎం.ఆర్ రాజా లాంటి వారిని ఎందుకు చూపించారు..?

ఇది ఆ టైంకి సంబందించిన కథ.. అందుకే దానికి రిలవెంట్ గా ఉంటుందని వారిని చూపించాం. 50, 60 దశకాల్లో నుంచి తీసుకున్న రిఫరెన్స్ లు ఇందులో చూపించామని అన్నారు రానా.

ఇది మీ ఫస్ట్ తమిళ సినిమా.. ఆ భాషలో పెర్ఫార్మ్ చేయడం ఎలా ఉంది భాగ్య శ్రీ గారు..?

ఈ సినిమా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.. అంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు 100 పర్సెంట్ ఇవ్వాలి. డైరెక్టర్ సెల్వ సపోర్ట్ తోనే ప్రతి లైన్ క్షుణ్ణంగా నేర్చుకున్నా. ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా.. నా పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి నచ్చడం ఆనందంగా ఉందని అన్నారు భాగ్య శ్రీ. ఈ సినిమా కోసం 6 నెలలు చెన్నైలోనే ఉన్నానని అన్నారు.

అంతేకాదు ఈ సినిమా కోసం సావిత్రి, శ్రీదేవి గారు చేసిన సినిమాలు చూశాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు ఇష్టం. అందులో పాత సినిమాలు చాలా ఇష్టం. అవన్నీ కూడా ఈ సినిమాకు ఉపయోగపడ్డాయని అన్నారు భాగ్య శ్రీ.

తెలుగుతో పాటు తమిళ్ లో రెస్పాన్స్ బాగుంది. ఇంత మంచి రెస్పాన్స్ తాను ఊహించలేదని అన్నారు భాగ్య శ్రీ.

ఇందులో మీ క్యారెక్టర్ కోసం ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా..?

డైరెక్టర్ సెల్వకి ఒక విజన్ ఉంది. ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి అన్నది తనకో ఐడియా ఉంది. అలానే చేశామని అన్నారు. ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వని రోల్ అది. ఈ సినిమాలో అలానే ఉండాలని ఫిక్స్ అయ్యి చేశామని రానా చెప్పారు.

రొటీన్ కమర్షియల్ సినిమాలు ఎందుకు చేయట్లేదు..?

మొదటి నుంచి డిఫరెంట్ దారిని ఎంచుకున్నాను.. నేను చూడని సినిమా ఇవ్వాలనే ఎప్పుడూ ఉంటుంది. అదే నాకు ఎగ్జైటింగ్ గా అనిపిస్తుందని రానా అన్నారు.

భాగ్య శ్రీ రెండు వారలలో మీ రెండు సినిమాలు వస్తున్నా ఎలా అనిపిస్తుంది..?

చాలా సంతోషంగా ఉంది. కాంత రెస్పాన్స్ ఆనందాన్ని ఇచ్చింది. రెండు డిఫరెంట్ సినిమాలు.. బ్యాక్ డ్రాప్ సినిమా అయినప్పటికీ కథపరంగా దేనికదే ప్రత్యేకమైన సినిమా అని అన్నారు భాగ్య శ్రీ.