Begin typing your search above and press return to search.

పసి మనసే.. కాంత ఫస్ట్ సాంగ్ తో రొమాంటిక్ హైప్!

రానా సొంతంగా ప్రొడ్యూసర్‌గానే కాకుండా ప్రమోషన్‌లోనూ పూర్తి ఎనర్జీ చూపిస్తున్నాడు..‘పసి మనసే’ సాంగ్‌కి సంబంధించిన ప్రివ్యూలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది.

By:  M Prashanth   |   8 Aug 2025 6:54 PM IST
పసి మనసే.. కాంత ఫస్ట్ సాంగ్ తో రొమాంటిక్ హైప్!
X

దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘కాంత’ ఇప్పుడు ప్రతి మూమెంట్‌కు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. రానా బ్యాగ్రౌండ్ లో స్పిరిట్ మీడియా, దుల్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై అత్యంత రిచ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు సెల్వమణి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. మరింతగా సినిమాకు ఉత్సాహాన్ని జోడించేందుకు ఇప్పుడు మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు.

ఇందులో భాగంగా రానా దగ్గుబాటి సోషల్ మీడియా ద్వారా ‘పసి మనసే’ ఫస్ట్ సాంగ్‌ను ప్రకటించారు. రానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, దుల్కర్ భాగ్యశ్రీ జంట రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రానా తన ట్వీట్‌లో ‘‘వెండితెరపై ప్రేమ వికసిస్తుంది! #Kaanthafilm మొదటి పాట ‘పాసి మనసే’ చూడండి.’’ అంటూ స్పెషల్ గా ప్రామోట్ చేశారు.

రానా సొంతంగా ప్రొడ్యూసర్‌గానే కాకుండా ప్రమోషన్‌లోనూ పూర్తి ఎనర్జీ చూపిస్తున్నాడు..‘పసి మనసే’ సాంగ్‌కి సంబంధించిన ప్రివ్యూలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. ఈ సాంగ్‌లో ప్రేమ, భావోద్వేగాలు అత్యంత సహజంగా ఉండటమే కాకుండా, 1960ల కాలనికి చెందిన బీట్స్, మ్యూజికల్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి.

రొమాంటిక్ న్యూ ఏజ్ ఫీల్‌తో పాట విడుదల కానుండటంతో సినిమా ప్రమోషన్‌కు పెద్ద ప్లస్ అయ్యింది. దర్శకుడు సెల్వమణి మ్యూజిక్‌, విజువల్స్ కాంబినేషన్‌పై చాలా కేర్ తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఫుల్ సాంగ్ శనివారం సాయంత్రం 4:30 విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంట ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్రలో మెప్పించనున్నారు.

ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, రానా దగ్గుబాటి ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా పనిచేయడమే కాదు, ప్రతి ప్రమోషన్ యాక్టివిటీలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయబోతున్నారు. టీజర్‌తోపాటు ఇప్పుడు పాట అప్డేట్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాంత మూవీలో రొమాంటిక్ ట్రాక్‌తోపాటు డ్రామా, మిస్టరీ అంశాలు వుండనున్నాయని సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, నేపథ్య సంగీతం, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి.