దుల్కర్ 'కాంత'.. మామూలు సర్ప్రైజ్ కాదు ఇది!
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు కాంత మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 12 Nov 2025 5:00 PM ISTమాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు కాంత మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాలో టాలీవుడ్ హల్క్ రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా.. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫెరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మిస్తుండగా.. 1940-50స్ బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందుతోంది. నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కానుండగా.. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే కాంత సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఎవర్ గ్రీన్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ మాయాబజార్ సినిమాకు యూజ్ చేసిన ఓ కెమెరాను ఇప్పుడు కాంత మూవీలో ఉపయోగించారట. ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి వెల్లడించారు.
నిజానికి అది సర్ప్రైజ్ విషయమనే చెప్పాలి. ఎందుకంటే మాయాబజార్ మూవీ విడుదలై కొన్నేళ్లు అవుతుంది. 1957లో రిలీజ్ అయ్యి సినీ ప్రియులను ఎంతగానో అలరించింది. 70 ఏళ్ల కిందట వచ్చిన ఆ సినిమా కోసం వినియోగించిన కెమెరాను ఇప్పుడు మళ్లీ ఉపయోగించడం విశేషం. దీంతో ఆ విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే కాంత సినిమాకు పాత కెమెరాలను వాడాల్సిన అవసరం వచ్చిందని, అందుకే ఆ కెమెరాను వినియోగించామని రానా తెలిపారు. పాతాళ భైరవి, మాయాబజార్ సినిమాలకు వాడిన మిచెల్ కెమెరాను కాంత మూవీకి గాను వినియోగించామని వెల్లడించారు. అదే సమయంలో ఆ కెమెరా తమకు ఎలా వచ్చిందో కూడా రానా తెలిపారు.
రానా తండ్రి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.. కొన్నేళ్ల క్రితం వాహిని స్టూడియో నుంచి మిచెల్ కెమెరాను తీసుకున్నారట. ఇప్పుడు దాన్ని రానా.. కాంత మూవీ కోసం అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ కెమెరాతో షూట్ చేసిన ఓ షాట్.. ట్రైలర్ లో కూడా యాడ్ చేశామని రానా రివీల్ చేశారు. మొత్తానికి మరో రెండు రోజుల్లో కాంత సినిమా విడుదల కానుండగా.. మిచెల్ కెమెరాతో షూట్ చేసిన సీన్స్ ఎలా ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.
