'కాంత' సెన్సార్.. సర్ ప్రైజ్ ప్యాకేజ్!
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ డ్రామా 'కాంత' ఫీవర్ పీక్స్‌కు చేరింది. నవంబర్ 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
By: M Prashanth | 13 Nov 2025 10:32 AM ISTదుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ డ్రామా 'కాంత' ఫీవర్ పీక్స్‌కు చేరింది. నవంబర్ 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ లాస్ట్ మినిట్‌లో, సినిమాకు సంబంధించిన ఫైనల్ అప్‌డేట్ వచ్చేసింది. 'కాంత' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాలోని ఇంటెన్స్ డ్రామా, పీరియాడిక్ వైబ్‌ను దృష్టిలో ఉంచుకుని, సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది.
దీంతో పాటు, సినిమా ఫైనల్ రన్‌టైమ్ కూడా లాక్ అయింది. 'కాంత' మొత్తం 2 గంటల 40 నిమిషాల నిడివితో ఉండబోతోంది. ఈ రన్‌టైమ్ చూస్తేనే, ఇది ఏదో పైపైన చెప్పే కథ కాదని, 1950ల నాటి ఆ పీరియాడిక్ వరల్డ్‌ను, ఇద్దరు ఆర్టిస్టుల మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్‌ను డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ చాలా డీటెయిల్డ్‌గా, పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నాడని క్లియర్‌గా అర్థమవుతోంది.
ఇక సినిమా చూసిన సెన్సార్ వర్గాల నుంచి వస్తున్న ఇన్‌సైడ్ టాక్.. సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తోంది. ట్రైలర్‌లో మనం చూసినట్టుగానే, ఈ సినిమాకు అసలు బలం యాక్టింగట. ముఖ్యంగా, గురు శిష్యులుగా నటించిన దుల్కర్ సల్మాన్, సముద్రఖని మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఇద్దరూ స్క్రీన్ మీద పోటా పోటీగా నటించేశారు అని, వాళ్ల మధ్య వచ్చే ఈగో క్లాష్ సీన్స్ ఆడియన్స్‌ను సీట్లకు కట్టిపడేస్తాయని అంటున్నారు.
ఈ ఇద్దరు స్టార్స్ మాత్రమే కాదు, 'కుమారి' పాత్రలో నటించిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా తన పెర్ఫార్మెన్స్‌తో ఆశ్చర్యపరిచిందని టాక్. ఇది కేవలం గ్లామర్ రోల్ కాదని, ఆ ఇద్దరు పవర్‌హౌస్ యాక్టర్ల మధ్య, భాగ్యశ్రీ కూడా అంతే స్ట్రాంగ్‌గా నిలబడిందని, తన నటనతో ఆకట్టుకుందని తెలుస్తోంది.
అయితే, అందరూ ఊహిస్తున్న దానికంటే పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్ మరొకటి ఉందట. ఆ సర్ప్రైజ్ మరెవరో కాదు, ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన రానా దగ్గుబాటి. రానా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించినా, ఆ క్యారెక్టర్‌ను ఇప్పటివరకు ప్రమోషన్లలో ఎక్కడా రివీల్ చేయలేదు. ఆడియన్స్‌కు ఇది ఒక కంప్లీట్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా ఉండబోతోందని, రానా ఎంట్రీ సినిమాకు మరో హైప్ ఇస్తుందని టాక్. ఫైనల్ గా 'కాంత' ఒక ఇంటెన్స్, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఫీస్ట్‌గా ఉండబోతోందని ఈ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక మరికొన్ని గంటల్లో థియేటర్లలో ఈ బ్లాక్ అండ్ వైట్ డ్రామా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
