దుల్కర్ 'కాంత'.. ఈ సాంగ్ ఇంకాస్త కొత్తగా..
జాను చంతర్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. ఈ పాటలో "నిజం నేనే.. అలల పొగరుని", "నిశి నేనే.. శశి నేనే.. పిడుగు పడినా పడనే పడదు వెనకడుగు" లాంటి తెలుగు రాప్ లిరిక్స్ ని అభినవకవి రాశారు.
By: M Prashanth | 30 Oct 2025 6:02 PM ISTమలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తన మార్కెట్‌ను చాలా తెలివిగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. 'సీతారామం'తో తెలుగులో క్లాసిక్ హిట్ కొట్టి, 'గన్స్ అండ్ గులాబ్స్'తో నార్త్‌లో క్రేజ్ తెచ్చుకున్న దుల్కర్, ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్నాడు. అదే 'కాంత'. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్ నుంచే క్యూరియసిటీని క్రియేట్ చేసుకుంటోంది, ఇక లేటెస్ట్ రిలీజైన టైటిల్ ట్రాక్ "రేజ్ ఆఫ్ కాంత" ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇది రెగ్యులర్ సినిమా కాదని, ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్‌ను కూడా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఇక "రేజ్ ఆఫ్ కాంత" పాట ఒక యాంథమ్‌లా ఉంది. ఇది కేవలం ఒక భాషకే పరిమితం కాలేదు. తెలుగు, తమిళ లిరిక్స్‌ను మిక్స్ చేసి, ఒక పవర్‌ఫుల్ రాప్ సాంగ్‌గా కంపోజ్ చేశారు.
జాను చంతర్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. ఈ పాటలో "నిజం నేనే.. అలల పొగరుని", "నిశి నేనే.. శశి నేనే.. పిడుగు పడినా పడనే పడదు వెనకడుగు" లాంటి తెలుగు రాప్ లిరిక్స్ ని అభినవకవి రాశారు. ఈ ప్రాజెక్ట్ ఇంతలా బజ్ క్రియేట్ చేయడానికి కారణం కేవలం దుల్కర్ సల్మాన్ మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న ప్రొడక్షన్ టీమ్.
ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ వయఫేరర్ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాలతో కలిసి నిర్మిస్తున్నారు. వీరిద్దరితో పాటు ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కూడా నిర్మాతలుగా ఉన్నారు. ఇలా రెండు డిఫరెంట్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ యాక్టర్స్ కలిసి ఒక సినిమాను నిర్మించడం అనేది చాలా అరుదైన, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్.
'కాంత' ఒక పీరియడ్ డ్రామా థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ఒకప్పటి సూపర్ స్టార్స్ సినీ తారల లైఫ్ ను వెండితెరపై ఫిక్షనల్ గా చూపించనున్నట్లు తెలుస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్‌తో పాటు సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. టీజర్, సాంగ్ విజువల్స్ అన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో, చాలా ఇంటెన్స్‌గా, స్టైలిష్‌గా ఉన్నాయి. ఇక 'కాంత' సినిమాను నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
