కావ్య కళ్యాణ్ రామ్ - కాలభైరవ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కాలభైరవ సోదరుడితో సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న కావ్య కళ్యాణ్ రామ్.. అప్పుడప్పుడు పలు ఈవెంట్లలో కలిసి సందడి చేశారు.
By: Madhu Reddy | 15 Sept 2026 6:25 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఏ ఇద్దరు జంటగా కనిపించినా వారి మధ్య ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఆ రూమర్స్ ఎక్కువ అయ్యే కొద్దీ అవి చివరికి నిజంగా మారుతాయి. అలా ఇప్పటికే ఎన్నో జంటలు సోషల్ మీడియాలో రూమర్స్ ఎదుర్కొని చివరికి వైవాహిక బంధం లోకి అడుగు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక అలాంటి వారిలో ఇప్పుడు కళ్యాణ్ రామ్ , కాలభైరవ జంట కూడా ఒకటి అని చెప్పవచ్చు.
కాలభైరవ సోదరుడితో సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న కావ్య కళ్యాణ్ రామ్.. అప్పుడప్పుడు పలు ఈవెంట్లలో కలిసి సందడి చేశారు. అయితే ఫ్రెండ్షిప్ అనుకున్నారు కానీ తరచూ ఇద్దరూ ఒకే చోట కెమెరా కంటపడడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే ఈ రూమర్లను నిజం చేస్తూ కావ్య కళ్యాణ్ రామ్, కాలభైరవ తామిద్దరం రిలేషన్ లో ఉన్నామని, పెళ్లికి కూడా సిద్ధమవుతున్నామని అఫీషియల్ గా ప్రకటించారు. ఎట్టకేలకు సైలెంట్ గా నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లికి సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతం కాలభైరవ వారణాసి కోసం పనిచేస్తున్న నేపథ్యంలో పెండింగ్ వర్క్ పూర్తి చేసుకుని, కొంత బ్రేక్ తీసుకొని ఆ తర్వాత పెళ్లికి సిద్ధం కాబోతున్నారు అనే వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కావ్య కళ్యాణ్ రామ్ తెలంగాణ కొత్తగూడెంలో 1998 జూలై 20న జన్మించింది. కాలభైరవ 1993 ఆగస్టు 7న జన్మించారు. ఇక దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఐదు సంవత్సరాల వయసు తేడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్న వేళ ఇద్దరి మధ్య వచ్చిన ఏజ్ గ్యాప్ పెద్ద సమస్య కాదంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.
ఇదే సమయంలో వీరిద్దరి మధ్య ఎడ్యుకేషన్ వివరాలు కూడా వైరల్గా మారాయి. కోడూరి కాలభైరవ సెయింట్ మేరీస్ కళాశాల యూసుఫ్ గూడాలో తన ఉన్నత విద్యను పూర్తి చేశారు. కావ్య కళ్యాణ్ రామ్ పూణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి బిఏఎల్ఎల్బి (ఆనర్) డిగ్రీని అందుకున్నారు.
