Begin typing your search above and press return to search.

చిరంజీవి వద్దకు చేరిన రిలీజ్ పంచాయతీ..!

చిరంజీవి నటిస్తున్న ‘కాకా’, ‘విశ్వంభర’ సినిమాల విడుదల తేదీలపై సందిగ్ధత నెలకొంది. 2027 సంక్రాంతికి ‘కాకా’ను విడుదల చేయాలని బాబీ, నిర్మాత పట్టుబడుతుండగా.. అదే సీజన్‌లో ‘విశ్వంభర’ను తీసుకురావాలని యూవీ క్రియేషన్స్ భావిస్తున్నట్లు సమాచారం. రెండు సినిమాల మధ్య కనీసం 3-4 వారాల గ్యాప్ ఉండాలని బయ్యర్లు సూచిస్తుండటంతో ఈ వ్యవహారం చిరంజీవి వద్దకు చేరే అవకాశం ఉంది.

By:  Ramesh Palla   |   26 Nov 2026 2:17 PM IST
చిరంజీవి వద్దకు చేరిన రిలీజ్ పంచాయతీ..!
X

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'కాకా' సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుందని అధికారిక ప్రకటన వచ్చింది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న కాకా సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్‌, పోస్టర్స్‌ అంచనాలు భారీగా పెంచాయి. దాంతో కాకా ఎప్పుడు వస్తుందా అని అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కి సినిమా వస్తుందని అధికారికంగా ప్రకటన వచ్చినప్పటికీ మళ్లీ ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాకా సినిమాను సంక్రాంతికి కాకుండా 2027 సమ్మర్‌ లో విడుదల చేయడానికి నిర్మాత ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాను అదే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో రెండు సినిమాల నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.

చిరంజీవి కాకా విడుదల సస్పెన్స్‌...

మొదట 2027 సంక్రాంతికి కాకా విడుదల కన్ఫర్మ్‌ అని, అదే సంక్రాంతికి విశ్వంభర ని సైతం విడుదల చేస్తారని, రెండు సినిమాలకు రెండు మూడు రోజుల గ్యాప్‌ ఉండే విధంగా చూసుకుని విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే మెగా ఫ్యాన్స్ ఆ విషయమై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం కరెక్ట్‌ కాదని, చిరంజీవి రెండు సినిమాలు అది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాలను ఒకేసారి విడుదల చేయడం ద్వారా రెండు సినిమాలకు పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉందని, అందుకే ఈ రెండు సినిమా విడుదలకు కనీసం మూడు నుంచి నాలుగు వారాల గ్యాప్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలని ఇండస్ట్రీలోకి ప్రముఖ బయ్యర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో ఈ రెండు సినిమాల విడుదల పంచాయితీ ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి వద్దకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

విశ్వంభర సినిమా సంక్రాంతి రిలీజ్‌...

విశ్వంభర సినిమాను వంశీ, ప్రమోద్‌లు యూవీ క్రియేషన్స్‌ లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రూపొందిన విశ్వంభర సినిమా గత రెండేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ ప్రధానంగా సాగుతుందని, భారీ సోషియో ఫాంటసీ సినిమా అని మేకర్స్ చెబుతున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కారణంగా సినిమా చాలా ఆలస్యం అయింది. ప్రారంభం అయిన సమయంలో మంచి బజ్‌ ఉండేది. కానీ మరీ ఎక్కువ కాలం ఆలస్యం కావడంతో బజ్‌ తగ్గిందని చెప్పక తప్పదు. అయితే విడుదల తర్వాత కచ్చితంగా మంచి సినిమాను చూశాం అని మౌత్‌ టాక్‌ వస్తుందని, తప్పకుండా సినిమాకు హిట్‌ టాక్‌ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇలాంటి ఫ్యామిలీ సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుంది అని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే చిరంజీవి వద్దకు సంక్రాంతి రిలీజ్‌ కోసం వెళ్తారని టాక్‌.

చిరంజీవి వద్ద రిలీజ్ డేట్స్‌ పంచాయితీ..

ఇక కాకా సినిమా విషయానికి వస్తే వెంకట్‌ కే నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ లో రూపొందిన ఈ సినిమాను మొదటి నుంచి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. పైగా చిరంజీవి, బాబీ కాంబోలో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా కూడా సంక్రాంతికి వచ్చిన నేపథ్యంలో సెంటిమెంట్‌ రిపీట్‌ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు సంక్రాంతికే కాకా సినిమాను విడుదల చేయాలని నిర్మాత నారాయణ మరియు దర్శకుడు బాబీ గట్టిగా పట్టుబడుతున్నారు. విశ్వంభర ఎలాగూ రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తుంది. కనుక మరో నెల రెండు నెలలు వాయిదా వేసుకోవచ్చు కదా అనే అని కాకా మేకర్స్ అంటున్నట్లు తెలుస్తోంది. కానీ విశ్వంభర మేకర్స్‌ మాత్రం ఇది సంక్రాంతి సినిమా అంటున్నారు. మరి ఈ పంచాయతిని మెగాస్టార్‌ చిరంజీవి ఎలా తీర్చుతారు అనేది చూడాలి.