Begin typing your search above and press return to search.

కాకా : షూటింగ్‌ చివరి దశలోనూ ఆ సస్పెన్స్‌ కంటిన్యూ!

'కాకా' సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినప్పటికీ ఒక నటి విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు.

By:  Ramesh Palla   |   17 Sept 2026 3:54 PM IST
కాకా : షూటింగ్‌ చివరి దశలోనూ ఆ సస్పెన్స్‌ కంటిన్యూ!
X

మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరంజీవి 'కాకా' సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సినిమాను సంక్రాంతి 2027కి విడుదల చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు బాబీ జెట్‌ స్పీడ్‌తో సినిమాను పూర్తి చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. చిరంజీవి సైతం సినిమాను సంక్రాంతికి తీసుకు వచ్చేందుకు తన వంతు సహకారంను పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. కానీ విశ్వంభర సినిమా వల్ల కాకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. కాకా సినిమా షూటింగ్‌ మాత్రం శరవేగంగా కంటిన్యూ అవుతూనే ఉంది. చిరంజీవి పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్న దర్శకుడు బాబీ అన్ని అనుకున్నట్లుగా జరిగితే నవంబర్‌లో సినిమాకు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయని యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు.

చిరంజీవి కాకా సినిమా షూటింగ్‌...

'కాకా' సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినప్పటికీ ఒక నటి విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. దర్శకుడు బాబీ ఇప్పటి వరకు చిరంజీవికి జోడీగా నటించే హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. చిరంజీవి ఈ సినిమాలో మిడిల్ ఏజ్ గ్రూప్‌లో కనిపించబోతున్నాడు. మెడిసిన్ చదివే అమ్మాయికి తండ్రిగా చిరంజీవి కనిపిస్తాడు. కనుక ఆ ఏజ్‌కు తగ్గట్లుగానే హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. యంగ్‌ ఏజ్ గ్రూప్‌ హీరోయిన్‌ను తీసుకుంటే బాగుండదని భావిస్తున్నారు. అలా అని కాస్త సీనియర్‌ ఏజ్‌ గ్రూప్‌ హీరోయిన్స్‌లో ఎవరు కూడా చిరంజీవికి సరి జోడీ అనిపించుకోవడం లేదట. అందుకే ఎంపిక విషయంలో దర్శకుడు జుట్టు పీక్కుంటున్నాడు అని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కాజల్‌, నయనతార వంటి హీరోయిన్స్‌ ను తీసుకుంటే మెడిసిన్ చదివే కూతురుకు తల్లిగా అనిపించక పోవచ్చు అనేది యూనిట్‌ సభ్యుల అభిప్రాయంగా తెలుస్తోంది.

చిరంజీవికి జోడీగా స్నేహ లేదా ప్రియమణి

చిరంజీవికి జోడీగా మొదటి నుంచి ఆ పాత్ర కోసం రెండు మూడు పేర్లు బలంగా వినిపించాయి. మొదటగా ప్రియమణి కాగా ఆ తర్వాత మీనా పేరును సైతం కొందరు చర్చించారు. ఆ తర్వాత లయ విషయంలోనూ చర్చలు జరిగాయి అని పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు స్నేహ పేరు వినిపిస్తోంది. ప్రియమణి లేదా స్నేహ ల్లో ఒకరు చిరంజీవికి జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రియమణి ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. స్నేహ మాత్రం టాలీవుడ్‌లో కనిపించి చాలా కాలం అయింది. వేరే భాషల్లో అప్పుడప్పుడు కనిపించినా ఓవరాల్‌గా స్నేహ ఇండస్ట్రీలో ప్రజెన్స్ కాస్త తగ్గింది. అయితే చిరంజీవికి జోడీగా నటించడం వల్ల కచ్చితంగా ఆమెకు మళ్లీ పూర్వ వైభవం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆమెను సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సంక్రాంతికి రానున్న కాకా మూవీ...

చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటి వరకు చిరంజీవికి జోడీగా ఎవరు ఎంపిక అయ్యారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కనుక మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హీరోయిన్‌ విషయంలో నెలకొన్న సస్పెన్స్‌ కు ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకు యూనిట్‌ సభ్యులు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. చివరి రెండు షెడ్యూల్స్‌లో కాకా, ఆయన భార్య పై సన్నివేశాల చిత్రీకరణ చేయాల్సి ఉంది. అందుకే త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వెంటనే ప్రకటించకున్నా ఆమెతో వచ్చే నెల ఆరంభం నుంచి షూటింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. స్నేహ ను చిరంజీవికి జోడీగా నటింపజేయడం వల్ల కాస్త ఫ్రెష్‌ లుక్‌ ఉండవచ్చు అంటున్నారు. ఇంతకు ముందు వీరి కాంబోలో మూవీ లేదు. కనుక మెగా ఫ్యాన్స్ ఈ కాంబినేషన్‌ను కోరుకుంటున్నారు. అయితే చిరంజీవి నిర్ణయం ఏంటి అనేది చూడాలి. బాబీ సైతం చిరంజీవి నిర్ణయానికి గౌరవించే అవకాశాలు ఉన్నాయి.