మెగా అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చేలా 'కాకా'!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మాస్ దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం `కాకా`. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయం సాధించిందో తెలిసిందే.
By: Srikanth Kontham | 15 Oct 2026 8:18 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మాస్ దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం `కాకా`. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈసారి `కాకా` చిత్రం మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉండబోతోందని రచయిత కోన వెంకట్ వ్యాఖ్యల్లో కనిపిస్తుంది. ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ పాటలు, రొమాంటిక్ సీన్లు ఉండవని కోన స్పష్టం చేయడంతో మెగా అభిమానులకు ఇదో రకమైన బిగ్ షాక్ అనే చెప్పాలి.
సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకాభిమానులు గ్రాండ్ సాంగ్స్, అదిరిపోయే మాస్ డాన్సులు, రొమాంటిక్ ఎలిమెంట్స్ , పవర్ ఫుల్ కామిక్ టైమింగ్‌ను ఆశిస్తారు. కానీ `కాకా` విషయంలో బాబీ పూర్తిగా ఒక విభి న్నమైన రూట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అనవసరమైన కమర్షియల్ హంగులకు చోటు ఇవ్వకుండా కథలోని గాఢమైన ఎమోషన్ చుట్టూనే మొత్తం డ్రామాను నడిపిస్తున్నట్లు కోన వెంకట్ మాటలను బట్టి అర్థమవుతోంది.
బాబీ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే.. ఆయన ఎలాంటి కథను తీసుకున్నా? దాన్ని మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా పక్కాగా కమర్షియలైజ్ చేయడంలో సిద్ధహస్తుడు. కథనంలో గ్రిప్పింగ్ పేసింగ్‌ను రన్ చేస్తూనే మాస్ ఎలివేషన్లతో థియేటర్లలో ఈలలు వేయించడం బాబి ప్రత్యేకత. అయితే `కాకా` విషయంలో ఆ ఫార్ములాను పక్కనపెట్టి అంతకు మించిన రా అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
కమర్షియల్ పాటలు, రొమాన్స్ లేకపోవడం వల్ల మెగా అభిమానులకు కాస్త నిరాశ నిరాశకలిగినా? ఇది మెగాస్టార్ నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని చెప్పొచ్చు. కథా బలం, బలమైన ఎమోషన్స్ ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా? ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఇప్పటికే పలు చిత్రాలు నిరూపించాయి. చిరంజీవి వంటి నటుడి పరిపూర్ణమైన పర్ఫార్మెన్స్ చూడటానికి ఈ ప్రయోగం చక్కటి వేదికగా మారనుంది.
ప్రస్తుతం ట్రెండ్ కూడా మారుతోంది. కథకు అవసరం లేకపోయినా బలవంతంగా పాటలు, రొమాంటిక్ ట్రాక్‌లు ఇరికించడం కంటే సీరియస్ ఇంటెన్స్ డ్రామాగా నడిచే కంటెంట్‌ను నేటి ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించే బాబీ- చిరంజీవి ఇమేజ్‌కు సరికొత్త డైమెన్షన్ ఇస్తూ స్క్రిప్ట్‌ను డిజైన్ చేసి ఉంటారని తెలుస్తోంది.
మొత్తానికి కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు `కాకా` సినిమాపై అంచనాలను ఒక్కసారిగా మార్చివేశాయి. పాటలు, రొమాన్స్ లేని ఎమోషనల్ అటెంప్ట్‌తో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ రిపీట్ చేస్తారో? మాస్ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.
