ఆ సీక్వెల్ లో హీరో, హీరోయిన్ ఛేంజ్?
హృతిక్ రోషన్-యామీ గౌతమ్ జంటగా సంజయ్ గుప్తా తెరకెక్కించిన `కాబిల్` అప్పట్లో ఓ క్లాసిక్ హిట్ గా నిలిచింది.
By: Srikanth Kontham | 19 Jan 2026 4:00 PM ISTహృతిక్ రోషన్-యామీ గౌతమ్ జంటగా సంజయ్ గుప్తా తెరకెక్కించిన `కాబిల్` అప్పట్లో ఓ క్లాసిక్ హిట్ గా నిలిచింది. దృష్టి లోపమున్న ఇద్దరి మద్య పరిచయం ప్రేమగా మారడం, ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టడాన్ని ఎంతో అందంగా, హృద్యంగా మలిచారు సంజయ్. 2017 లో రిలీజ్ అయిన రొమాంటిక్ థ్రిల్లర్ ఓ క్లాసిక్ చిత్రంగా అలరిస్తుంది. సన్నివేశాల్లో ఎలాంటి అసభ్యత లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ ఎంటర్ టైనర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంధుడి పాత్రలో హృతిక్ ,యామీ గౌతమ్ కట్టి పడేసారు. ఇద్దరు రియలిస్టిక్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకుంటారు.
ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటే బాగుంటుందనే అప్పట్లోనే అభిమానులు అభిప్రిఆయపడ్డారు. సీక్వెల్ చేయాలని సంజయ్ గుప్తాను అడిగారు. కానీ అప్పుడాయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తాజాగా ఎనిమిదేళ్లకు `కాబిల్` కు సీక్వెల్ గా `కాబిల్ 2`ని ప్రకటించి సర్ ప్రైజ్ చేసారు. సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అడగగా దర్శకుడు ఈ విషయాన్ని రివీల్ చేసారు. సీక్వెల్ సిద్దంగా ఉంది. ఇప్పుడు రాబోయే చిత్రం మునుపటి కంటే మరింత వైవిథ్యంగా ఉంటుందన్నారు. దీంతో `కాబిల్ 2`పై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి.
అయితే ఇందులో హీరో, హీరోయిన్లగా హృతిక్, యామీ గౌతమ్ లనే రిపీట్ చేస్తారా? కొత్త వారితో ముందుకెళ్తరా? అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. దర్శకుడు సీక్వెల్ ప్రకటించారు గానీ అందులో నటీనటులు ఎవరు? అన్నది వెల్లడించలేదు. సాధారణంగా బాలీవుడ్ లో సీక్వెల్స్ అంటే అందులో హీరో, హీరోయిన్లు మారిపోతారు. కొత్త నటీనటులతో దర్శకులు ముందుకెళ్తారు. `కాబిల్` సినిమా చేసే సమయానికి హృతిక్ మొదటి భార్యతో కలిసి ఉన్నారు. యామీ గౌతమ్ కూడా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడామెకు పెళ్లి అయింది.
ఓ బాబు కూడా ఉన్నాడు. హృతిక్ మరోకరితో సహజీవనం చేస్తున్నాడు. ఇలా ఇద్దరి జీవితాల్లో ఎన్నో మార్పు లొచ్చాయి. మరి ఈ మార్పులకు అనుగుణంగా సంజయ్ గుప్తా ఎలా మౌల్డ్ అవుతాడు? అన్నది చూడాలి. అయితే బాలీవుడ్ మీడియాలో కొత్త వారితోనే సంజయ్ ముందుకెళ్లే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అలా చేసినప్పుడు కంటెంట్ ప్రెష్ గా ఉంటుందని భావిస్తున్నారు. సీక్వెల్స్ విషయంలో బాలీవుడ్ వీలైనంత వరకూ ఇదే ట్రెండ్ ను అనుసరిస్తుంది? అని అంటున్నారు. మరేం జరుగుతుందన్నది చూడాలి. ప్రస్తుతం సంజయ్ గుప్తా ఈ సినిమాకు సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నాడు.
