మల్లెపూల పల్లకి ఎఫెక్ట్.. ఇప్పుడు మరో ఫోక్‌పై ఫోకస్
దీంతో డివోషనల్ సాంగ్ ను మాస్ ట్రీట్మెంట్ తో చూపిస్తే థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మల్లెపూల పల్లకి చూపించింది. ఇప్పుడు మరో పాపులర్ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నట్టు సమాచారం.
By: M Prashanth | 19 Sept 2026 11:35 PM ISTతెలుగు సినిమాల్లో ఫోక్ సాంగ్స్ కు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సినిమాలో భాగంగా మాత్రమే కనిపించిన ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు థియేటర్లలో మాస్ సెలబ్రేషన్ కు కారణమవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ముందే పాపులర్ అయిన పాటలను కొత్త బీట్ తో సినిమాల్లోకి తీసుకురావడం మంచి రిజల్ట్స్ ఇస్తోంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను మరోసారి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరుముడి సినిమాలోని మల్లెపూల పల్లకి సాంగ్ కు థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఆ పాట స్క్రీన్ పై మొదలైన వెంటనే ప్రేక్షకులు ఆ జోష్ లోకి వెళ్లిపోయారు. దీంతో డివోషనల్ సాంగ్ ను మాస్ ట్రీట్మెంట్ తో చూపిస్తే థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మల్లెపూల పల్లకి చూపించింది. ఇప్పుడు మరో పాపులర్ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నట్టు సమాచారం.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రఘుకుల తిలక రారా పాటను రీక్రియేట్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ సాంగ్ కు సంబంధించిన కాపీరైట్స్ ను మూవీ టీమ్ తీసుకున్నట్టు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తో ఆ పాటకు కొత్త బీట్ కూడా సిద్ధం చేయించినట్టు తెలుస్తోంది. రఘుకుల తిలక రారా సాంగ్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫుల్ పాపులర్.
భజన కళాకారుడు కొండల స్వామి రాసి, పాడిన ఆ పాట శ్రీరాముడి గొప్పతనాన్ని చెప్పేలా ఉంటుంది. ఒక జాతరలో హీరో కార్తీ ఆ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత యూట్యూబ్ లో 60 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం సాంగ్ కు ఉన్న రీచ్ ను చూపించింది. ఇలాంటి పాటను సినిమాలో ఎలా యూజ్ చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
కేవలం ఆ పాటను సేమ్ అలాగే పెట్టకుండా.. కొత్త మ్యూజిక్ తో, కథకు తగ్గట్టుగా మాస్ గా చూపించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. మల్లెపూల పల్లకి తర్వాత భక్తి ఫోక్ సాంగ్స్ పై పెరుగుతున్న ఫోకస్. నెట్టింట హిట్ అయిన పాటను రీక్రియేట్ చేస్తే.. అది కేవలం పాటగానే కాకుండా సినిమాకు ప్రమోషన్ గా కూడా యూజ్ అవుతోంది.
సాంగ్ ముందే తెలిసినదే కావడంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. థియేటర్ లో కొత్తగా కనిపించినప్పుడు అదే పాట మరోసారి వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఫార్ములా ప్రతిసారీ పనిచేయాలంటే సాంగ్ క్రేజ్ ఒక్కటే సరిపోదు. కథలో అది సరైన ప్లేస్ లో రావాలి. మ్యూజిక్, షూటింగ్, మాస్ ట్రీట్మెంట్ కూడా కలవాలి. మల్లెపూల పల్లకి విషయంలో ఇవన్నీ కలిసొచ్చాయి. ఇప్పుడు రఘుకుల తిలక రారా కూడా అదే రేంజ్ లో కనెక్ట్ అయితే.. వైరల్ డివోషనల్ ఫోక్ సాంగ్స్ రీక్రియేషన్ పెరిగే ఛాన్స్ ఉంది.
