Begin typing your search above and press return to search.

'K-ర్యాంప్'.. టిక్కల్ టిక్కల్ బీట్

ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో రాబోతున్నాడు.

By:  M Prashanth   |   7 Oct 2025 8:18 PM IST
K-ర్యాంప్.. టిక్కల్ టిక్కల్ బీట్
X

ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో రాబోతున్నాడు. రీసెంట్‌గా వచ్చిన 'క' (KA) మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ కొట్టడంతో, మార్కెట్‌లో క్రేజ్ మరింత పెరిగింది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్‌ని మెయింటైన్ చేస్తున్న కిరణ్.. ఈసారి పక్కా హెవీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


​కిరణ్ నటిస్తున్న ఈ కొత్త సినిమా టైటిల్ "K-ర్యాంప్". ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు హాస్య మూవీస్ రుద్రాంశ్ సెల్యులాయిడ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

​దీపావళి రిలీజ్‌కి టైమ్ దగ్గర పడుతుండడంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను స్పీడ్ చేసింది.

అందులో భాగంగా, ఈ రోజు సినిమా నుంచి మూడో సింగిల్ 'టిక్కల్ టిక్కల్..' పాటను రిలీజ్ చేశారు. ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ని, ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేసుకుని కంపోజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ తనదైన ఎనర్జిటిక్ ట్యూన్‌తో ఈ పాటకు సంగీతం అందించగా, సురేంద్ర కృష్ణ లిరిక్స్ రాశారు. ఇక సాయి చరణ్ భాస్కరుని ఆలపించారు.

​'టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్..' అంటూ సాగే ఈ పాట ట్రెండీగా, మాస్‌కు నచ్చేలా ఉంది. "టైమ్ కాస్త బ్యాడ్ అయితే కె ర్యాంప్ రా" వంటి లైన్స్ ద్వారా.. జీవితంలో అడ్డంకులు, ప్రేమలో ఫైర్లు ఎదురైనప్పుడు హీరో ఫాలో అయ్యే 'కె ర్యాంప్' రూల్ ఏంటో రివీల్ చేశారు. ఈ పాట కేవలం బీట్ మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న హీరో క్యారెక్టర్ ను కూడా ఎలివేట్ చేస్తూ, కథలో హీరో లవర్, లైఫ్ మధ్య ఎలా డీల్ చేస్తాడో చూపించే ప్రయత్నం చేసింది.

​కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో సీనియర్ నటులు నరేష్ సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు వెన్నెల కిషోర్ కూడా తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించనున్నారు. సాంకేతిక నిపుణులలో డీవోపీగా సతీష్ రెడ్డి మాసం, ఎడిటర్‌గా ఛోటా కె ప్రసాద్ వంటి అనుభవం ఉన్న టీమ్ వర్క్ చేసింది. ​మొత్తంగా, "K-ర్యాంప్" నుంచి వచ్చిన 'టిక్కల్ టిక్కల్..' పాట సినిమాపై అంచనాలను పెంచడమే కాదు, దీన్ని పక్కా పండగ సినిమాగా మార్చింది. ఈ పాటలోని కిక్, ట్యూన్, స్టెప్స్ థియేటర్లలో రచ్చ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.