Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం కె ర్యాంప్: మేకర్స్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందంటే..

ఇక రచయిత రవి మాట్లాడుతూ, హీరో కష్టపడితే ప్రేక్షకులకు ఆ సీన్స్ హత్తుకునేలా ఉంటాయి. కానీ కె ర్యాంప్లో హీరో ఎంత స్ట్రగుల్ అయితే ప్రేక్షకులు అంత ఎంజాయ్ చేస్తారు.

By:  M Prashanth   |   27 Sept 2025 7:10 PM IST
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్: మేకర్స్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందంటే..
X

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న థియేటర్లకు రానున్న కె ర్యాంప్ సినిమాపై ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించగా, హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, శివ బొమ్మకు ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ర్యాంప్ మీట్‌లో మొత్తం టీమ్ సినిమాపై తమ అనుభవాలు, కాన్ఫిడెన్స్ ను షేర్ చేసుకున్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, సినిమా మొత్తాన్ని మేమంతా చూశాం. అన్ని వర్గాల వయసుల వారు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఈ మూవీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. యుక్తి పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. మా కాంబినేషన్ థియేటర్‌లో ఆడియన్స్‌ని కచ్చితంగా నవ్విస్తుంది. మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సపోర్ట్ వల్లే ఇంత కంఫర్ట్‌గా వర్క్ చేశాం. ఈ దీపావళికి మా కె ర్యాంప్ పక్కా ఎంటర్‌టైన్ చేస్తుంది. నేను గ్యారెంటీ ఇస్తున్నని కిరణ్ అన్నారు.

ఇక రచయిత రవి మాట్లాడుతూ, హీరో కష్టపడితే ప్రేక్షకులకు ఆ సీన్స్ హత్తుకునేలా ఉంటాయి. కానీ కె ర్యాంప్లో హీరో ఎంత స్ట్రగుల్ అయితే ప్రేక్షకులు అంత ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ ఒక కొత్త అనుభూతి ఇస్తుంది. అక్టోబర్ 18న థియేటర్లలో అందరం కలసి ఆ ఫన్‌ను చూడబోతున్నాం” అన్నారు. ఇక ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి కూడా సినిమాపై పాజిటివ్ గా స్పందించారు ఆయన మాట్లాడుతూ.. “ఇది నా ఫస్ట్ మూవీ కిరణ్ అబ్బవరంతో. ఆయన ఎనర్జీ స్క్రీన్ మీద అద్భుతంగా కనిపిస్తుంది. డైరెక్టర్ నాని కథ చెప్పినప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో, సినిమా అంతకంటే బాగా వచ్చింది. హీరోయిన్ యుక్తి పాత్రకీ మంచి ప్రాధాన్యత ఉంది. మా ప్రొడ్యూసర్ రాజేష్ మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో ఆయనకీ మంచి పేరు వస్తుంది” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ, “కిరణ్‌తో ఇది నా మూడో మూవీ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా రెండు సాంగ్స్ రిలీజ్ చేస్తాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి ఫాదర్ సన్ ఎమోషన్ కూడా ఈ మూవీలో ఉంది. నరేష్ గారి పాత్ర ఫుల్ హిలేరియస్‌గా ఉంటుంది” అన్నారు.

దర్శకుడు జైన్స్ నాని మాట్లాడుతూ, “కిరణ్ అన్న చేసిన మీటర్ టైమ్‌లోనే ఈ కథ చెప్పాను. ఆయన వెంటనే ఓకే చేశారు. స్క్రీన్ మీద కొత్తగా కనిపిస్తారు. యుక్తి పాత్ర కూడా అంతే ఎంటర్‌టైన్ అవుతుంది. నరేష్ గారికి ఈ పాత్ర చెప్పడానికి భయపడ్డా. కానీ ఆయన వినగానే చేస్తానన్నారు. ‘కె ర్యాంప్’ అంటే బూతు మాట కాదు, కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని ఉద్దేశం. థియేటర్లో చూసినప్పుడు ఆ వైబ్ వస్తుంది” అని అన్నారు.

ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ, “ఈ కథను మొదట కిరణ్ గారు పంపించారు. విన్న వెంటనే మా బ్యానర్‌లో మరో ఎంటర్‌టైనర్ ఫిక్స్ అయ్యింది. నాని డైలాగ్స్ చాలా బాగా రాశారు. చేతన్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. హీరోయిన్ యుక్తి తన పాత్రలో చింపేసింది. నరేష్ గారు ఫాదర్‌లా మాకు సపోర్ట్ చేశారు. ఈ దీపావళి పోటీ ఎంత ఉన్నా మా మూవీపై మకున్న కాన్ఫిడెన్స్ ఎక్కువ” అని అన్నారు.

హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ, కిరణ్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. అతను నా బెస్ట్ కో స్టార్. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కి థ్యాంక్స్. చేతన్ మ్యూజిక్ బావుంది. ఈ సినిమా తర్వాత నాకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నానని అన్నారు. యాక్టర్ నరేష్ మాట్లాడుతూ, ఈ కథ విన్న వెంటనే బ్లాక్‌బస్టర్ అని చెప్పేశాను. ఈ సినిమాతో కిరణ్ స్టార్‌గా మరింత ఎత్తుకు వెళ్తాడు. ఆయన చాలా హంబుల్. హీరోయిన్ యుక్తి కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది. డైరెక్టర్ నాని తర్వాత నుంచి ‘జైన్స్ జోష్ నాని’గా మారతాడు. ఈ సినిమా మొత్తం హైలైట్‌గానే ఉంటుందని తెలిపారు.