Begin typing your search above and press return to search.

కే ర్యాంప్ లో బూతులు.. హీరో ఏమన్నారంటే..

ఇక ఈ సినిమా వచ్చే నెల 18న రిలీజ్ కానుందు. ఈ నేపథ్యంలో ఇవాళ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సినిమా టైటిల్, టీజర్ లో ఉన్న అభ్యంతరకర పదాలపై మూవీటీమ్ మాట్లాడింది.

By:  M Prashanth   |   27 Sept 2025 6:15 PM IST
కే ర్యాంప్ లో బూతులు.. హీరో ఏమన్నారంటే..
X

తెలుగు సినిమాల్లో బూతు డైలాగులు, అభ్యంతరకరమైన పదాలు వాడడం ఈ మధ్య ఎక్కువైపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. డైరెక్టర్ మారుతి కూడా ఇటీవల ఈ విషయంలో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాను బూతులు చాలా తగ్గించాను అని కూడా ఒప్పుకున్నారు. ఇక కొందరు ఎన్ని ఎక్కువ బుతులు ఉంటే సినిమా అంత క్లిక్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారో ఏమో. కానీ, సినిమాలో అలాంటి పదాలు వాడేస్తున్నారు.

అయితే మరికొన్ని సినిమాలు అలా కాదు. టీజర్ లేదా ట్రైలర్ తోనే సినిమా ఎలా ఉండనుందో క్లూ ఇస్తారు. ఈ క్రమంలోనే సినిమాపై హైప్ పెంచేందుకు కొన్ని బూతు పదాలు, అభ్యంతరకరమైన డైలాగులు వాడుతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఇంకొన్ని మాత్రం టైటిల్ తోనే కాంట్రవర్సీ అవుతాయి. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ సినిమాకు అలాంటిదే జరిగింది. ఇటీవల ఈ సినిమా టీజర్ ను మేకర్స్ వదిలారు. ఇందులో ఒకట్రెండు అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నాయి. అలాగే ఈ సినిమా టైటిల్ పైనా చర్చ జరుగుతోంది.

ఇక ఈ సినిమా వచ్చే నెల 18న రిలీజ్ కానుందు. ఈ నేపథ్యంలో ఇవాళ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సినిమా టైటిల్, టీజర్ లో ఉన్న అభ్యంతరకర పదాలపై మూవీటీమ్ మాట్లాడింది. హీరో కిరణ్ అబ్బవరం టీజర్ లో ఉన్న పదాల గురించి మాట్లాడుతూ... నేను రీసెంట్ గా ఓ సినిమాకు వెళ్లాను. చాలా మంచి సినిమా. ఆ సినిమాకు థియేటర్లలో బూతులకు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను తప్పు అనడం లేదు.

సందర్భాన్ని బట్టి వాడాల్సి వస్తుంది. మేం కూడా అంతే. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి చెప్పే ప్రయత్నమే టీజర్. అందులో ఆ క్యారెక్టర్ ఉన్నపరిస్థితుల్లో ఎవరికైనా అదే డైలాగ్ వస్తుంది. అది కాకుండా పద్ధతిగా ఇంకో డైలాగ్ పెడితే అందరూ థియేటర్లలోంచి బయటకు వెళ్లిపోతారు. మీరు సినిమా చూశాక అలా ఫీల్ అవ్వరు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ మా సినిమాలో ఉన్నాయి. పక్కా అందరూ ఎంజాయ్ చేస్తారు. అని కిరణ్ అన్నారు.

అలాగే కే ర్యాంప్ అంటే అసభ్యకరమైన పదం కాదని, కిరణ్ ర్యాంప్ అని డైరెక్టర్ టైటిల్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను జైన్స్ నాని తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరో పేరు కుమార్ అని, అందుకే కే ర్యాంప్ అని టైటిల్ పెట్టినట్లు చెప్పారు. కాగా ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటులు నరేష్, సాయి కుమార్ , వెన్నెల కిషోర్ తదితరులు ఇందులో నటించారు.