సౌత్ ఇండస్ట్రీపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు!?
సూర్య జ్యోతిక దంపతులు చెన్నై ను వదిలి ముంబైలో కాపురం ఉంటోన్న సంగతి తెలిసిందే. హిందీ సినిమాలపై ఆసక్తితో కొంత కాలంగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తున్నారు.
By: Srikanth Kontham | 31 Aug 2025 6:00 AM ISTసూర్య జ్యోతిక దంపతులు చెన్నై ను వదిలి ముంబైలో కాపురం ఉంటోన్న సంగతి తెలిసిందే. హిందీ సినిమాలపై ఆసక్తితో కొంత కాలంగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తున్నారు. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటిస్తూ సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఓ సినిమా ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేసారు. సినిమా పోస్టర్లలలో హీరోయి న్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.
హిందీ పరిశ్రమలో లభించిన గుర్తింపు, గౌరవం సౌత్ లో దక్కడం లేదన్నారు. సౌత్ లో ఎంతో మంది హీరోలతో పని చేసాను. కానీ ఏ హీరో చిత్రంలోనూ తన పోస్టర్ ను ఎవరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఆసక్తి చూపించలేదన్నారు. ఇక్కడి సినిమా పోస్టర్లలలో కేవలం హీరోలు మాత్రమే హైలైట్ అవుతుంటారు. హీరోయిన్ పేరుతో ఎలాంటి పోస్టర్లు ఉండవు. వాళ్లను పెద్దగా ఫోకస్ చేయరన్నారు. హిందీలో తాను నటించిన `సైతాన్` సినిమా పోస్టర్ ను అజయ్ దేవగణ్ షేర్ చేసారని గుర్తు చేసారు.
అలాగే మలయాళంలో `కాథల్ ది కోర్` సినిమాలో నటించాను. అందులో నా పోస్టర్ ను మమ్ముట్టి షేర్ చేసారు. ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం సౌత్ ఇండస్ట్రీలో ఎందుకుడదని ప్రశ్నించారు. ఎంత బిజీగా ఉన్నా? ఒక్క పోస్టర్ కూడా షేర్ చేసే సమయం కేటాయించలేరా? అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. జ్యోతిక చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకించి కోలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమ లను ఉద్దేశించి చేసినట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు.
ఈ రెండు పరిశ్రమల్లో జ్యోతిక ఎక్కువ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. కన్నడలోనూ కొన్ని సినిమాలు చేసారు. కొంత మంది జ్యోతిక వ్యాఖ్యల్ని కండిస్తు న్నా మరికొంత మంది మద్దతిస్తున్నారు. సినిమా ప్రచా రాన్ని హీరో భుజాల మీద వేసుకుని చేయాలి. కానీ అదే సినిమాకు చుట్టంలా వ్యవరించడం ఏంటనే ప్రశ్న లు వ్యక్తమవుతున్నాయి. మరి వీటిపై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ప్రతిస్పందనలుంటాయో చూడాలి.
