Begin typing your search above and press return to search.

చిట్టి డ్రెస్​లో టెలివిజన్ నటి.. అందాల సెగలు

రెడ్ కలర్ షార్ట్ స్లిప్ డ్రెస్​లో ఎంతో గ్లామరస్ గా కనిపిస్తూ, అందాలను హైలెట్ చేసింది. ఆమె స్టైలిష్ పోజులు, కాన్ఫిడెంట్ లుక్ ఫ్యాన్స్​ను ఫిదా చేస్తున్నాయి.

By:  M Prashanth   |   29 Oct 2025 7:46 PM IST
చిట్టి డ్రెస్​లో టెలివిజన్ నటి.. అందాల సెగలు
X

సోషల్ మీడియా, గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని, నటిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిలో జ్యోతి పూర్వాజ్ ఒకరు. మోడల్​గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ బ్యూటీ, తన గ్లామరస్ ఫొటోషూట్లతో, స్టైలిష్ లుక్స్​తో నెటిజన్లను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇన్​స్టాగ్రామ్​లో తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుని, ఇంటర్నెట్ సెన్సేషన్​గా మారింది.

లేటెస్ట్ గా ఈ బ్యూటీ తన ఇన్​స్టాలో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ రిసార్ట్​లోని స్విమ్మింగ్ పూల్ పక్కన బాల్కనీలో నిలబడి పోజులిచ్చింది. రెడ్ కలర్ షార్ట్ స్లిప్ డ్రెస్​లో ఎంతో గ్లామరస్ గా కనిపిస్తూ, అందాలను హైలెట్ చేసింది. ఆమె స్టైలిష్ పోజులు, కాన్ఫిడెంట్ లుక్ ఫ్యాన్స్​ను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

మోడల్​గా కెరీర్ ప్రారంభించిన జ్యోతి, 'గుప్పెడంత మనసు' వంటి సీరియల్ తో పాటు మరికొన్ని తెలుగు వెబ్ సిరీస్​లు, చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రాజెక్టులలో తన నటనతో పాటు, గ్లామర్​తోనూ యూత్​లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్​కు బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు, మరిన్ని వెబ్ ప్రాజెక్టులపై కూడా దృష్టి సారిస్తోంది.

ఇండస్ట్రీలో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న జ్యోతి, నటనకు ఆస్కారమున్న పాత్రల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. కేవలం గ్లామర్ డాల్​గా మిగిలిపోకుండా, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేయాలని ఆసక్తిగా ఉంది. మరోవైపు, పలు బ్రాండ్లకు ప్రమోటర్​గా కూడా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది. సినిమా అవకాశాలు ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం జ్యోతి ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్, గ్లామరస్ ఫొటోషూట్లను పంచుకుంటూ, తన ఫాలోవర్లకు నిత్యం టచ్​లో ఉంటూ తన క్రేజ్​ను ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటోంది.