బ్లాక్ శారీలో సన్నని నడుము.. అందాల జ్యోతి స్టన్నింగ్ లుక్
గ్లామర్ వరల్డ్ లో ఎంతోమంది అప్సరసల నడుమ పోటీని తట్టుకోవడం అంత చిన్న విషయం కాదు.
By: M Prashanth | 28 April 2026 1:00 AM ISTగ్లామర్ వరల్డ్ లో ఎంతోమంది అప్సరసల నడుమ పోటీని తట్టుకోవడం అంత చిన్న విషయం కాదు. ఇక వారిలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్, తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బ్లాక్ ట్రాన్స్‌పరెంట్ శారీలో ఆమె కనిపిస్తున్న తీరు చూస్తుంటే, ట్రెడిషనల్ వేర్‌లో కూడా గ్లామర్‌ను ఎలా ఎలివేట్ చేయాలో ఆమెకు బాగా తెలుసనిపిస్తోంది. అతిగా చేయకుండా, కేవలం తన చూపులతోనే కుర్రకారును ఆకట్టుకుంటోంది.
ఈ లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ ఫోటోల్లో జ్యోతి తన నేచురల్ బ్యూటీని చాలా చక్కగా ప్రజెంట్ చేసింది. విరబోసిన జుట్టు, సింపుల్ మేకప్, మెడపై ఉన్న చిన్న టాటూ ఆమె లుక్‌కు ఒక మోడ్రన్ టచ్ ఇచ్చాయి. ముఖ్యంగా కెమెరా వైపు చూస్తూ ఆమె ఇస్తున్న స్మైల్ ఫోటోలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. నేటి జనరేషన్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూనే, శారీ కట్టులో ఉండే ఆ హుందాతనాన్ని ఎక్కడా తగ్గకుండా చూసుకుంది.
డీసెంట్ అప్పీల్‌తోనే గ్లామర్ డోస్ పెంచవచ్చని ఈ క్లిక్స్‌తో నిరూపించింది. జ్యోతి పూర్వాజ్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె ప్రయాణం చాలా బలన్స్డ్ గా సాగుతోంది. బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ఆడియన్స్‌ను అలరిస్తోంది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేయడానికే ఆమె ప్రాధాన్యత ఇస్తోంది.
ఇండస్ట్రీలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో ఆమె సక్సెస్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జ్యోతికి మిలియన్ల కొద్దీ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ప్రతి ఫోటో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నటిగానే కాకుండా ఒక ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా ఆమె ఎదుగుతోంది. ఫిట్‌నెస్ విషయంలో ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలు ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన లుక్స్‌తో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తోంది. ముఖ్యంగా యువతలో ఆమెకు ఉన్న క్రేజ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. మరి అమ్మడు ఈ గ్లామర్ తో ఎలాంటి ఆఫర్లు అందుకుంటుందో చూడాలి.
