భారతదేశంలో అత్యంత ధనికురాలైన నటి?
బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ పరిశ్రమల్లోను జూహీ చావ్లా సుపరిచితురాలు. అక్కినేని నాగార్జున సరసన `విక్కీ దాదా` చిత్రంలో జూహీ నటించారు.
By: Sivaji Kontham | 18 Dec 2025 6:00 AM ISTబాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ పరిశ్రమల్లోను జూహీ చావ్లా సుపరిచితురాలు. అక్కినేని నాగార్జున సరసన `విక్కీ దాదా` చిత్రంలో జూహీ నటించారు. హిందీ చిత్రసీమలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన జూహీ నిర్మాతగా పలు సినిమాలను కూడా నిర్మించారు. అలాగే ఐపీఎల్ లోను జూహీ పెట్టుబడులు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా ఉన్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై షారూఖ్‌తో కలిసి జూహీ పెట్టుబడులను పెట్టారు. ఈ పెట్టుబడులు జూహీ చావ్లా, ఆమె భర్త జే మెహతాలను రిచెస్ట్ ఇండియన్ సెలబ్రిటీలుగా మార్చాయి.
హురూన్ ఇండియా సర్వే ప్రకారం.. జూహీ చావ్లా ఆస్తుల విలువ రూ.7,790 కోట్లు. భర్త ఆస్తులతో కలిపి నికర ఆస్తుల విలువ ఇది. అయితే 2024 నాటికి ఈ ఆస్తుల విలువ కేవలం రూ.4600 కోట్లు. 2025 హురూన్ లిస్ట్ ప్రకారం.. ఒక్క ఏడాదిలోనే రూ.3,190కోట్ల సంపదల్ని ఈ జంట అదనంగా జోడించారు. అయితే దీనివెనక జూహీ, ఆమె భర్త వ్యాపార నైపుణ్యం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
సీనియర్ నటి జూహీ చావ్లా దేశంలోనే అత్యంత సంపన్న నటిగా ఏళ్లతరబడి తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఆమె భర్త, పారిశ్రామికవేత్త జే మెహతా విజయవంతమైన బిజినెస్ మేన్ గా రాణిస్తున్నారు. రకరకాల వ్యాపారాల నుండి ఈ జంట భారీగా ఆర్జిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి షారూఖ్ తో మెహతా సహయజమాని. ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ తోను జూహీ అనుబంధం కలిగి ఉన్నారు. జూహీ చావ్లా- జే మెహతా జంట రియల్ ఎస్టేట్ రంగంలోను సుప్రసిద్ధులు.
జూహీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. గత 15ఏళ్లలో అసలు సినిమాలే లేవ్. కానీ తన భర్త తో కలిసి లాభసాటి వ్యాపారాల్లో జూహీ తలమునకలుగా ఉన్నారు. దానికి తగ్గట్టే తన ఆదాయం పదింతలు పెరుగుతోంది. రియల్ ఎస్టేట్, ఐపీఎల్ సహా పలు రంగాల్లో పెట్టుబడులు అత్యంత లాభసాటిగా మారడంతో ఆస్తులు అమాంతం పెరుగుతున్నాయని కథనాలొస్తున్నాయి.
