జూనియర్ ఎన్టీఆర్ కు గాయం.. ఏం జరిగిందంటే?
ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి పోస్ట్‌లు చేస్తున్నారు.
By: M Prashanth | 19 Sept 2025 6:56 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అనుకోని ప్రమాదానికి గురైన వార్త అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలికి స్వల్ప గాయం కావడంతో ఆయన వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లారు.
అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉందని స్పష్టమైంది. వైద్యుల సలహా మేరకు ఎన్టీఆర్ రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. షూటింగ్ సెట్‌లో చిన్న ప్రమాదం జరిగినప్పటికీ, ఫ్యాన్స్ మధ్య పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు ఆయన కార్యాలయం అఫీషియల్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.
“2025 సెప్టెంబర్ 19న జరిగిన యాడ్ షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ స్వల్ప గాయానికి గురయ్యారు. వైద్యుల సూచన ప్రకారం ఆయనకు రెండు వారాల విశ్రాంతి అవసరం. అభిమానులు, మీడియా ఎలాంటి ఊహాగానాలు చేయకుండా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం” అని అధికారిక నోట్ లో తెలిపారు.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి పోస్ట్‌లు చేస్తున్నారు. #GetWellSoonNTR, #StayStrongNTR వంటి ట్రెండ్స్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అవుతున్నాయి. పలు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ ఎన్టీఆర్ ఆరోగ్యంపై శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన తిరిగి మరింత ఎనర్జీతో సెట్స్‌కి రావాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉన్నారు. డ్రాగన్ లాంటి సినిమాలతో పాటు అనేక టాప్ బ్రాండ్లకు ఆయన బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నారు. మెక్‌డొనాల్డ్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, గ్రీన్‌ప్లే, జెప్టో, ఆప్పీ ఫిజ్, ఫ్రూటీ వంటి అంతర్జాతీయ కంపెనీలతో ఆయనకు కాంట్రాక్టులు ఉన్నాయి. ఈ కారణంగా ఆయన మార్కెట్ విలువ మరింత పెరిగింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఈ గాయం కారణంగా షెడ్యూల్‌లో చిన్న మార్పులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ గాయం వార్త మొదట ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగించినా, ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టమైన తర్వాత అందరూ రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఈ రెండు వారాల విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ యథావిధిగా తన షూటింగ్స్, యాడ్స్‌తో బిజీ అయ్యే అవకాశం ఉంది.
