Begin typing your search above and press return to search.

తారక్ 'డ్రాగన్'.. నీల్ ఎలా యూజ్ చేసుకుంటారో?

నాలుగున్నర నిమిషాల నిడివితో విడుదలైన గ్లింప్స్‌ లో డార్క్ వరల్డ్, నల్లమందు మాఫియా, వైలెన్స్ యాక్షన్‌ తో కూడిన కథను పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.

By:  M Prashanth   |   20 May 2026 11:00 PM IST
తారక్ డ్రాగన్.. నీల్ ఎలా యూజ్ చేసుకుంటారో?
X

అర్ధరాత్రి ఒక్క వీడియో వచ్చిందంతే.. సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా డ్రాగన్ మేనియాతో మార్మోగిపోయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నారోనని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. నాలుగున్నర నిమిషాల నిడివితో విడుదలైన గ్లింప్స్‌ లో డార్క్ వరల్డ్, నల్లమందు మాఫియా, వైలెన్స్ యాక్షన్‌ తో కూడిన కథను పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. అదే సమయంలో మళ్లీ నీల్ పాత స్టైలేనా? అన్న చర్చ కూడా మొదలైంది.

నిజానికి డ్రాగన్ వరల్డ్ ను పరిచయం చేస్తూ రూపొందించిన గ్లింప్స్‌ లో 1960ల నాటి నల్లమందు వ్యాపారం, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలు, డ్రగ్ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ ను చూపించారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల చుట్టూ తిరిగే కథగా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో హీరో పాత్రను అత్యంత వైలెన్స్, డేంజరస్ వ్యక్తిగా ప్రజెంట్ చేయడం ఆసక్తి పెంచింది. హీరోయిన్ రుక్మిణి వసంత్ రోల్ ద్వారా తారక్ ను చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

లూగర్ అనే డేంజరెస్ కిల్లర్ రోల్ లో తారక్ కనిపించిన విధానం అభిమానులను మెప్పిస్తోంది. లీన్ అండ్ రఫ్ లుక్, గంభీరమైన వాయిస్, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్‌ తో తారక్ మరోసారి పవర్ ఫుల్ అవతార్ లో కనిపించారు. ముఖ్యంగా ట్రిగ్గర్ నొక్కగానే మారిపోవడం దేవుడు ఇచ్చిన వరం అంటూ చెప్పిన డైలాగ్ గ్లింప్స్‌ కు హైలైట్‌ గా నిలిచింది ఇక కథలో విలన్లకు చెక్ పెట్టే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించడం ఆసక్తి పెంచింది. అలాగే అశుతోష్ రాణా వంటి పలువురు నటీనటులు కథలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.

భారీ స్కేల్, డేంజరస్ వరల్డ్ బిల్డింగ్‌ తో నీల్ ఈసారి కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే గ్లింప్స్‌ పై ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేజీఎప్, సలార్ చిత్రాల్లో కనిపించిన డార్క్ టోన్, స్లో మోషన్ ఎలివేషన్స్, హెవీ యాక్షన్ ట్రీట్మెంట్ మళ్లీ ఇక్కడ కూడా కనిపించాయని కామన్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. విజువల్స్, ఫ్రేమింగ్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ వరకు కూడా నీల్ గత సినిమాల ఫీలింగ్ వచ్చిందనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన బీజీఎం, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ విజువల్స్ గ్లింప్స్‌ కు హైలైట్‌ గా నిలిచినా.. అవి కూడా అదే స్టైల్‌ లోనా? అనే సందేహాన్ని ప్రేక్షకుల్లో కలిగించాయి. ముఖ్యంగా రెగ్యులర్ మూవీ లవర్స్ మాత్రం ఈసారి ప్రశాంత్ నీల్ నుంచి పూర్తిగా కొత్త అనుభూతి ఆశించామని చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. ప్రస్తుతం సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ ను టీమ్ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కథ, ఎమోషన్స్, యాక్షన్ ఎలివేషన్స్‌ తో పాటు కొత్తదనం చూపించగలిగితే డ్రాగన్ మరో సంచలనంగా మారే అవకాశం ఉంది. మరి టైమ్ ను నీల్ కొత్తగా ఎలా యూజ్ చేసుకుంటారో చూడాలి.