Begin typing your search above and press return to search.

మాస్ అండ్ అల్ట్రా స్టైలిష్ గా తారక్.. ఈ లుక్ ఎక్కడిది?

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తాజాగా తన ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన తారక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  M Prashanth   |   8 May 2026 1:42 PM IST
మాస్ అండ్ అల్ట్రా స్టైలిష్ గా తారక్.. ఈ లుక్ ఎక్కడిది?
X

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ప్రస్తుతం ఒక ఫోటో భారీ చర్చకు దారితీస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తాజాగా తన ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన తారక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ అండ్ వైట్ షేడ్‌ లో కనిపించిన ఆ పిక్ లో తారక్ స్టైలిష్‌ గా, మరింత స్లిమ్‌ గా కనిపించడం అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది.




ముఖ్యంగా వెట్ హెయిర్, స్పెషల్ గెడ్డం స్టైల్, నోట్లో టూత్‌ పిక్‌ తో కనిపించిన తారక్ లుక్‌ కు ఫ్యాన్స్ అంతా అట్రాక్ట్ అవుతున్నారు. ఫుల్ గా ట్రెండ్ చేస్తూ.. సూపర్ అన్న అంటూ పోస్టులు పెడుతున్నారు. మాస్ లుక్ అదిరిపోయేలా ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తారక్ తో తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీలోనిదే ఆ లుక్ అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు.

అయితే కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు తారక్ లుక్.. ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఆ మూవీలోనిదో కాదో అన్నది అఫీషియల్ గా తెలియదు. కానీ అభిమానులు మాత్రం ఇదే తారక్ కొత్త అవతార్ అంటూ సోషల్ మీడియాలో ఫుల్ గా సందడి చేస్తున్నారు.

ముఖ్యంగా తారక్ పిక్ ను పోస్ట్ చేసిన తమన్ కు థ్యాంక్స్ కూడా చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు తారక్- తమన్ మధ్య ఉన్న రిలేషన్ మరోసారి చర్చకు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌ కు టాలీవుడ్‌ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో బాద్‌షా, రామయ్య వస్తావయ్యా, రభస, టెంపర్, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలకు తమన్ సంగీతం అందించారు.

ఆ చిత్రాల పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ కు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా తారక్ మాస్ ఇమేజ్‌ కు తగ్గట్టుగా సంగీతాన్ని అందించడంలో తమన్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అదే సమయంలో పలు ఇంటర్వ్యూల్లో తమన్, తారక్‌ పై ఉన్న అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. తారక్‌ ను అన్న అని పిలుస్తూ.. ఆయనపై ఉన్న రెస్పెక్ట్ ని రివీల్ చేశారు.

నటుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా తారక్ ఎంతో గొప్పవారని తమన్ పలుమార్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అరవింద సమేత సినిమా సమయంలో జరిగిన సంఘటనను ఆయన తరచూ గుర్తు చేసుకుంటుంటారు. తారక్ తండ్రి హరికృష్ణ మరణం తర్వాత కూడా షూటింగ్‌ కు హాజరై పని పట్ల చూపిన డెడికేషన్ ను చూసి తాను ఎంతో ఎమోషనల్ అయ్యానని తమన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వ్యక్తిగత విషాదాన్ని పక్కనపెట్టి, ప్రొఫెషనల్ కమిట్‌మెంట్‌ ను నిలబెట్టుకున్న తారక్ పర్సనాలిటీ తనను ఎంతగానో ఇన్స్పైర్ చేసిందని చెప్పారు. ఇక తారక్‌ కు కూడా తమన్ సంగీతంపై ప్రత్యేక నమ్మకం ఉందని అంతా చెబుతుంటారు. వీరి కాంబినేషన్‌ లో వచ్చిన అనేక పాటలు చార్ట్‌ బస్టర్లుగా నిలిచాయి. మాస్ బీట్స్‌ తో పాటు ఎమోషనల్ సీన్స్ కు తగ్గ సంగీతాన్ని అందించడంలో తమన్ శైలి కనిపిస్తుందని అభిమానులు భావిస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ఫోటోతో మరోసారి తారక్- తమన్ బాండింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. ఒక నార్మల్ ఇన్ స్టా స్టోరీలో పిక్ పోస్ట్ చేస్తే అభిమానుల్లో ఇంత హైప్ తీసుకురావడం తారక్ క్రేజ్‌ కు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి.