Begin typing your search above and press return to search.

యూఎస్ కాన్సులేట్ లో తారక్.. నీల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

ఇక ఈ మీట్ కు సంబంధించి అమెరికా కాన్సుల్ లారా.. కాన్సులేట్ కు తారక్ ను ఆహ్వానించేదుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం.

By:  M Prashanth   |   16 Sept 2025 7:31 PM IST
యూఎస్ కాన్సులేట్ లో తారక్.. నీల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..
X

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఈ సినిమాతో తారక్ కు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు లభించింది. ఆయన సినిమాలు భారత్ సహా జపాన్, అమెరికాలోనూ ఆడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా ఆయన హైదరాబాద్ లోని అమెరికా కాన్సలేట్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోలను కాన్సుల్ జనరల్ అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇందులో తారక్ బ్లాక్ ప్యాండ్ అండ్ సింపుల్ టీ షర్టు ధరించారు. గాగుల్స్ , చేతికి వాచ్ తో ఆయన స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

ఇక ఈ మీట్ కు సంబంధించి అమెరికా కాన్సుల్ లారా.. కాన్సులేట్ కు తారక్ ను ఆహ్వానించేదుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. ఆయన రీసెంట్, అఫ్ కమింగ్ సినిమా ప్రాజెక్ట్ లు యునైటెడ్ స్టేట్స్ లో షూటింగ్ జరనున్నాయి. ఈ క్రమంలో భారత్- అమెరికా సంబంధాలు మరింత దృఢంగా చేసుకునేందుకు, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుంది. అని రాసుకొచ్చారు.

ఈ ఫొటోల్లో తారక్ తో లారా సరదాగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అప్ కమింగ్ షెడ్యూల్ యూఎస్ లో జరగనుందని అర్థమవుతోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాతో రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే తారక్ రీసెంట్ గా వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ అంచనాలతో గతనెల 14న రిలీజైంది. కానీ అంచనాలు అందుకో వడంలో విఫలం అయ్యింది. ఇక తారక్ ప్రస్తుతం ఫుల్ డెడికేషన్ ప్రశాంత్ నీల్ సినిమాకే పెడుతున్నారు. ఈ సినిమా కోసమే ఆయన బరువు కూడా తగ్గారు. ఇందులో తారక్ శక్తి మంతమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా కనిపించనుంది. మిగతా నటీనటుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో ఓ షెడ్యూల్ కర్ణాటకలో పూర్తైంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా సంయుక్తంగా రూపొందుతోంది. 2026 జూన్ 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.