Begin typing your search above and press return to search.

మే 20న సోషల్ మీడియా షేక్.. ఎన్టీఆర్ కోసం భారీ ప్లానింగ్!

టాలీవుడ్‌లో స్టార్ హీరోల బర్త్‌డేలు సాధారణంగా అభిమానులకు పండుగ లాంటివే.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 May 2026 11:04 AM IST
మే 20న సోషల్ మీడియా షేక్.. ఎన్టీఆర్ కోసం భారీ ప్లానింగ్!
X

టాలీవుడ్‌లో స్టార్ హీరోల బర్త్‌డేలు సాధారణంగా అభిమానులకు పండుగ లాంటివే. కానీ ఈసారి ఎన్టీఆర్ బ‌ర్త్ డే మాత్రం ఫ్యాన్స్ కు మరింత ప్రత్యేకంగా మారబోతోందనే సంకేతాలు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తున్నాయి. మే 20న యంగ్ టైగర్ బర్త్‌డే సందర్భంగా ఒకే రోజు మూడు భారీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉండటంతో అభిమానుల్లో ఉత్సాహం అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పటికే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్స్, పోస్టర్ డిజైన్స్ మొదలైపోయాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిజమైన బ‌ర్త్‌డే బ్లాస్ట్ రెడీ అవుతుంద‌ని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన కథ, లుక్, షూటింగ్ లొకేషన్స్ వంటి విషయాలను టీమ్ పూర్తిగా గోప్యంగా ఉంచింది. అయితే మే 20న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ కానుందని అధికారిక సంకేతాలు రావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ నెక్ట్స్ లెవెల్ కు చేరుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు డ్రాగ‌న్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. గ్లింప్స్ ద్వారా కథ టోన్, హీరో మాస్ లుక్, అలాగే ప్ర‌శాంత్ నీల్ స్టైల్ యాక్షన్ వ‌ర‌ల్డ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. కెజిఎఫ్, స‌లార్ తర్వాత ప్ర‌శాంత్ నీల్ రూపొందిస్తున్న మరో పాన్ ఇండియా మాస్ విజువల్ స్పెక్టకిల్ ఇదేననే అంచనాలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్నాయి.

ఇక మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే మైథాలజికల్ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా లార్డ్ మురుగన్ కాన్సెప్ట్ ఆధారంగా ఉండబోతుందనే వార్తలు అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన త్రివిక్రమ్ తొలిసారి మైథాలజీ జానర్‌ను టచ్ చేయడం, అందులోనూ ఎన్టీఆర్ తో ఆ సినిమా చేయ‌డం ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ను తీసుకొచ్చింది. బాల నటుడిగా బాల రామాయణం మూవీలో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మైథాలజికల్ పాత్రలో కనిపించబోతుండటం అభిమానులకు స్పెషల్ ఎమోషన్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో కూడా బర్త్‌డే సందర్భంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇవే కాకుండా దేవ‌ర సీక్వెల్ దేవ‌ర‌2 నుంచి కూడా కొత్త పోస్టర్ వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌న్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఒకే రోజు డ్రాగ‌న్ గ్లింప్స్, గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్‌మెంట్, దేవ‌ర‌2 పోస్ట‌ర్ లాంటి వరుస అప్డేట్స్ రావడం నిజ‌మైతే అది ఫ్యాన్స్ కు నిజమైన ఫెస్టివల్‌గా మారడం ఖాయం. మొత్తానికి ఆర్ఆర్ఆర్ తర్వాత తార‌క్ ఎంచుకుంటున్న ప్రతి సినిమా వేర్వేరు మార్కెట్లను టార్గెట్ చేస్తుండటం విశేషం. అందుకే ఈసారి ఎన్టీఆర్ బర్త్‌డే కేవలం సెలబ్రేషన్ మాత్రమే కాదు.. ఫ్యాన్స్ కు మినీ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌గా మారబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.