Begin typing your search above and press return to search.

‘దేవర’ తర్వాత మళ్లీ కలయిక..'గాడ్ అఫ్ వార్ ’పై భారీ హైప్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోయే భారీ మైథలాజికల్ ఫిల్మ్ ‘గాడ్ ఆఫ్ వార్’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌కు టైమ్ ఫిక్స్ అయింది.

By:  Madhu Reddy   |   29 Jun 2026 11:30 AM IST
‘దేవర’ తర్వాత మళ్లీ కలయిక..గాడ్ అఫ్ వార్ ’పై భారీ హైప్!
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోయే భారీ మైథలాజికల్ ఫిల్మ్ ‘గాడ్ ఆఫ్ వార్’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌కు టైమ్ ఫిక్స్ అయింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కన్ఫర్మ్ అవ్వడంతో ఇండస్ట్రీలో హైప్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. ‘దేవర’ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్, అనిరుధ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో సోషల్ మీడియా మొత్తం ఈ క్రేజీ అప్‌డేట్‌తో ఊగిపోతోంది.

బాక్సాఫీస్ షేక్ చేసిన కాంబో:

గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక తారక్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ లోతైన డైలాగ్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒక పౌరాణిక నేపథ్యం ఉన్న కథతో జతకడుతుండటంతో సరికొత్త రికార్డుల వేట మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది.

అనిరుధ్‌కు ఫస్ట్ టైమ్ మైథలాజికల్ ఎక్స్‌పీరియన్స్:

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇప్పటివరకు ఎన్నో కమర్షియల్, మాస్ యాక్షన్ సినిమాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. గతం లో ఎన్టీఆర్ తో దేవర మూవీ తో హిట్ కాంబో అనిపించుకున్నాడు. కానీ ఆయన కెరీర్‌లోనే ఒక భక్తి లేదా పౌరాణిక చిత్రానికి సంగీతం అందించడం ఇదే మొదటిసారి. ఇక లార్డ్ మురుగన్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రానికి అనిరుధ్ ఎలాంటి డివోషనల్ అండ్ పవర్‌ఫుల్ ట్యూన్స్ ఇస్తారో చూడాలని అటు మ్యూజిక్ లవర్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా పాన్-ఇండియా నిర్మాణం:

ఈ అల్టిమేట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.ఇక నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో ఇచ్చిన హింట్స్‌తో అభిమానులు అప్పుడే ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ హంగామా మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు.

ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, త్రివిక్రమ్ మేధస్సు, అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్... ఈ మూడు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ రావడం గ్యారెంటీ. ‘దేవర’ క్రేజ్ తర్వాత వస్తున్న ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విజువల్ వండర్‌గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం మనమూ కాసేపు వెయిట్ చేద్దాం!