పిక్‌టాక్ : యంగ్ టైగర్ న్యూ లుక్ వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో #NTRNEEL సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 5 Nov 2025 1:38 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో #NTRNEEL సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో దేవర 2 సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని ఊహించిన అభిమానులకు నిరుత్సాహం తప్పలేదు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చాలా వారాలుగా ఎన్టీఆర్-నీల్ సినిమా షూటింగ్ జరగడం లేదు. దాంతో సినిమా గురించి పుంకాను పుంకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్...
ప్రశాంత్ నీల్ రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ విభేదించాడని, దాంతో షూటింగ్ ఆగిపోయింది అంటూ గత కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా డిసెంబర్‌లో పునః ప్రారంభం అవుతుందని నిర్మాణ సంస్థ నుంచి అనధికారికంగా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ప్రశాంత్ నీల్ తన స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో ఎన్టీఆర్ తిరిగి షూటింగ్‌కు హాజరు అయ్యేందుకు రెడీ అయ్యాడు అని కూడా కొత్త ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మళ్లీ పట్టాలు ఎక్కబోతుంది. అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ లుక్ రెడీ అవుతుంది అంటూ తాజాగా ఆయన ఫోటోలు చూస్తే అర్థం అవుతోంది. తాజాగా ఎన్టీఆర్ కొత్త లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బ్లాక్ జర్కిన్ ధరించి, చెక్స్ షర్ట్ ధరించిన ఎన్టీఆర్ బ్లాక్ గాగుల్స్ తో స్టైలిష్ లుక్ తో అదరగొట్టాడు.
#NTRNEEL సినిమా కోసం ఎన్టీఆర్ లుక్
ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో మరీ సన్నగా అవుతున్నాడు, ఆయన బరువు తగ్గితే మొహంలో తేజస్సు తగ్గుతుంది అని కొందరు విమర్శలు చేసిన వారు ఉన్నారు. కానీ తాజా ఫోటోలను చూస్తే అభిమానులు ఆనందం వ్యక్తం చేసే విధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ మరీ సన్నగా కాకుండా, మీడియం రేంజ్‌లో ఉన్నాడు. అంతే కాకుండా ఆయన హెయిర్ స్టైల్, గడ్డం, మీసాలు ఆకట్టుకుంటున్నాయి. అలా నడుచుకుంటూ వెళ్తూ మీసం తిప్పిన ఎన్టీఆర్ ఫోటోలు ప్రస్తుతం ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్నాయి. హీరోయిన్స్ స్కిన్ షో చేసిన ఫోటోలు, వీడియోలను మించి యంగ్ టైగర్ సినిమా లుక్ ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సాధారణంగానే హ్యాండ్సమ్ లుక్ తో చూపరులను ఆకట్టుకుంటూ ఉంటాడు. అలాంటిది ఈ లుక్ లో అంతకు మించి ఉన్నాడని, వెండి తెరపై ఇలా ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ అంటున్నారు.
ఎన్టీఆర్ దేవర 2 సినిమా ఉందా?
దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీ, దేవర 2 సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా సినిమాలు ఆలస్యం అవుతూ వచ్చాయి. ముఖ్యంగా వార్ 2 ఫ్లాప్ నేపథ్యంలో ఎన్టీఆర్ తదుపరి సినిమాల విషయంలో చాలా మార్పులు వచ్చినట్లుగా తెలుస్తోంది. దేవర 2 సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే కమిట్ అయిన ఒక సినిమాను సైతం ఎన్టీఆర్ నిరాకరించాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మళ్లీ కొత్తగా కథలు వింటున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ 2026 లో రెండు సినిమాలతో రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది సాధ్యమేనా చూడాలి.
