పిక్‌టాక్ : అమ్మతో జూనియర్ నందమూరి టైగర్స్
నందమూరి ఫ్యామిలీ మరో జెనరేషన్ కిడ్స్‌గా ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు ఇద్దరూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు.
By: Ramesh Palla | 13 Oct 2025 12:25 PM ISTనందమూరి ఫ్యామిలీ మరో జెనరేషన్ కిడ్స్‌గా ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు ఇద్దరూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. వీరిద్దరు ఎక్కడ కనిపించినా మీడియా వారు వారి కెమెరాలకు పని పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా వీరిద్దరు ఎయిర్ పోర్ట్‌లో కనిపిస్తారు. ఎన్టీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనతో ఉన్న ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. భార్గవ్ రామ్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడు ఎప్పటికప్పుడు మారుతూ చాలా ముద్దుగా కనిపిస్తున్నాడని, చిన్నప్పుడు ఎన్టీఆర్ ఎలా అయితే ముద్దుగా ఉన్నాడో ఇప్పుడు భార్గవ్ రామ్ అలా అందంగా ఉన్నాడు అంటూ చాలా మంది మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇద్దరికి ఇద్దరూ సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే మంచి ఫాలోయింగ్ దక్కించుకోవడంతో రాబోయే రోజుల్లో హీరోలుగా నటిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ పెళ్లిలో...
తాజాగా ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ వివాహం వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకలో అభయ్, భార్గవ్‌లు ఏ స్థాయిలో సందడి చేశారో చూశాం. మేనమామ పెళ్లి కావడంతో వీరిద్దరూ చాలా స్పెషల్‌గా నిలిచారు. ఆకట్టుకునే రూపంతో పాటు, మంచి ఔట్ ఫిట్‌ను ధరించడం ద్వారా వీరిద్దరిపై మీడియా వారు ఎక్కువగా దృష్టి పెట్టారు. పెళ్లిలో వీరి యొక్క ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అంతే కాకుండా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వద్ద కూర్చుని దిగిన ఫోటోలు, వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఇద్దరూ సరదాగా ఆడుకుంటున్న ఫోటోలు కూడా నెట్టింట తెగ సర్క్యులేట్ అయ్యాయి. మొత్తానికి ఎన్టీఆర్ కిడ్స్ ఇద్దరూ చాలా కాలం తర్వాత ఎక్కువగా మీడియాలో కనిపించారు. ఎప్పుడూ ఇలా వచ్చి అలా వెళ్లి పోయినట్లుగా ఉండే వీరు ఈసారి నందమూరి ఫ్యాన్స్ కి కన్నుల పండుగ అన్నట్లుగా నిలిచారు.
అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు
తాజాగా పెళ్లి వేడుకలో భాగంగా నార్నే నితిన్ రిసెప్షన్ వేడుక జరిగింది. ఆ కార్యక్రమంలోనూ అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు స్టైలిష్ లుక్ లో కనిపించారు. ముద్దుగా ఉన్న వీరిద్దరు తల్లి లక్ష్మి ప్రణతితో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లక్ష్మీ ప్రణతి సైతం రిసెప్షన్ కోసం స్టైలిష్ లుక్ లో కనిపించింది. అయితే రిసెప్షన్‌లో ఎన్టీఆర్ ఎలా పాల్గొన్నాడు అనేది మాత్రం బయటకు రాలేదు. తర్వాత ఎన్టీఆర్ ఫోటోలు వస్తాయేమో కానీ ప్రస్తుతానికి ఈ తల్లికొడుకుల ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అభయ్ రామ్ అప్పుడే తల్లి అంత ఎత్తుకు ఎదిగాడు. ముందు ముందు రోజుల్లో తల్లిని మించి ఎత్తు ఇద్దరూ అయ్యేలా ఉన్నారు అంటూ ఈ ఫోటోలకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ..
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే వార్ 2 తో తీవ్రంగా నిరాశ పరచిన ఎన్టీఆర్ త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీతో పాటు, ఎన్టీఆర్ నటించే మరో సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని నందమూరి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతానికి పెళ్లి హడావిడిలో ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే డ్రాగన్ సినిమా షూటింగ్‌కి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల నడుము నొప్పి కారణంగా ఆపరేషన్ చేయించుకున్నాడు అంటూ ఎన్టీఆర్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్టీఆర్ నడుం నొప్పి కారణంగా కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఆ విషయం కాంతార చాప్టర్ 1 సినిమా వేడుక సమయంలో నిరూపితం అయింది. బావమరిది పెళ్లిలో మాత్రం ఎన్టీఆర్ హుషారుగా కనిపించాడు. కనుక ఆయన ఆరోగ్యం సెట్ అయినట్లే అని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
