Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ కి ఆ టైమ్ లో ఫ్లాప్ లు రావడానికి కారణం ఏంటి?

నందమూరి ఫ్యామిలీ మూడోతరం వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు... ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా అవతరించాడు.

By:  Gopi Velupala   |   27 Oct 2026 4:52 PM IST
జూనియర్ ఎన్టీఆర్ కి ఆ టైమ్ లో ఫ్లాప్ లు రావడానికి కారణం ఏంటి?
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి ఫ్యామిలీ మూడోతరం వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు... ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా అవతరించాడు. స్టార్టింగ్ లో వరుసగా విజయాలను అందుకున్న ఎన్టీఆర్ ఒకానొక సమయంలో ఒక్క సక్సెస్ ను సాధించడానికి చాలా కష్టపడ్డాడు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ 'సింహాద్రి' సినిమా తర్వాత 4 సంవత్సరాలపాటు విజయాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది...

ఎన్టీఆర్ ఫ్లాప్ లకు కారణం...

సింహాద్రి మూవీ సక్సెస్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీస్ చేశాడు. ఆంధ్రావాలా, నరసింహుడు లాంటి వరుస యాక్షన్ మూవీస్ చేసినప్పటికి అతనికి సరైన సక్సెస్ లు దక్కలేదు. ఎన్టీఆర్ తన రూట్ మార్చి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ 20 సంవత్సరాలకే టాప్ హీరోగా మారిన ఎన్టీఆర్ ఇమేజ్ కి సరిపడ కథలు దొరకలేదు. మాస్ సినిమాలు చేసిన అందులో కథలు ప్రేక్షకుడిని పెద్దగా ఎంగేజ్ చేయలేపోయాయి. 2006 వ సంవత్సరం లో వచ్చిన రాఖీ ఓకే అనిపించినప్పటికీ కమర్షియల్ హిట్ గా నిలువలేకపోయింది. ఈ మధ్య ఆ సినిమాను క్లాసిక్ హిట్ అంటున్నారు. కానీ అప్పట్లో ఈ మూవీ కి ఆశించిన మేరకు విజయం దక్కలేదు. రాజమౌళి రంగంలోకి దిగి యమదొంగ' మూవీ తో సక్సెస్ ను కట్టబెట్టాడు. ఆ తర్వాత అదుర్స్, బృందావనం లాంటి సక్సెస్ లు అందుకున్నాడు...

పాన్ ఇండియా ప్రాజెక్టులు...

ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకంతోనే ఉన్నాడు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే కెజిఎఫ్, సలార్ లాంటి వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. డ్రాగన్ మూవీ హై రేంజ్ విజువల్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతుందనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు... దేవర మూవీ తో 600 కోట్ల కలెక్షన్ ను రాబట్టిన ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ తో మాత్రం బాక్సాఫీస్ దగ్గర వద్ద భారీ రికార్డులు సృష్టించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ది గాడ్ ఆఫ్ వార్' అనే మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ తన కెరియర్ లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించినప్పటికి డ్రాగన్ మూవీలో అలాగే గాడ్ ఆఫ్ వార్ సినిమాలో లో చేయబోయే పాత్ర లు తనను ప్రేక్షకుడికి చాలా దగ్గర చేస్తాయని అలాగే ప్రపంచస్థాయి ప్రేక్షకులను అలరించే కంటెంట్ అందులో ఉందని ఆయన భావిస్తున్నాడు...