ఎన్టీఆర్ కి సర్జరీ.. అధికారికంగా ప్రకటించిన ఎన్టీఆర్ కార్యాలయం!
ఒకవైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇటీవల ఆయన భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
By: Madhu Reddy | 11 Aug 2026 7:34 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈయన.. ఆ తర్వాత దేవర సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక హిందీలో తొలి ప్రయత్నంలో భాగంగా వార్ 2 సినిమా చేసి డిజాస్టర్ ను మూటగట్టుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇటీవల ఆయన భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఎన్టీఆర్ భుజానికి సర్జరీ రేపే..
ఈ మేరకు ఎన్టీఆర్ కార్యాలయం నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో ఎన్టీఆర్ కి సర్జరీ చేయబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాదులోని ప్రముఖ కిమ్స్ హాస్పిటల్ లో ఆగస్టు 12 అనగా రేపు ఎన్టీఆర్ భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. నిపుణులైన వైద్య బృందం ఎన్టీఆర్ కి పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తోంది. ఆయన త్వరగా కోలుకోవడానికి కావలసిన అన్ని రకాల వైద్య సదుపాయాలను సిద్ధం చేశారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రతి అప్డేట్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు, మీడియాకు తెలియజేస్తాం అంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది ఎన్టీఆర్ కార్యాలయం.
ఎన్టీఆర్ భుజానికి గాయమైంది అంటూ ఎన్టీఆర్ ఆఫీస్ ప్రకటన..
ఇకపోతే ఈ ప్రకటన కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఎన్టీఆర్ కి సర్జరీ సక్సెస్ అవ్వాలని, ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా గత రెండు వారాల క్రితం ఎన్టీఆర్ కార్యాలయం మరో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ భుజానికి గాయమైందని చెప్పడానికి మేము చింతిస్తున్నాము. ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. వైద్య బృందం సలహా మేరకు ఎన్టీఆర్ ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది అంటూ ప్రకటిస్తూ.. రేపు సర్జరీ జరగబోతున్నట్లు ఇప్పుడు మరో ప్రకటనతో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
డ్రాగన్ మూవీ మరింత ఆలస్యం కానుందా?
ఇదిలా ఉండగా మరొకవైపు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ షూటింగ్ వాయిదా పడే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన డ్రాగన్ మూవీ ఇప్పుడు ఎన్టీఆర్ భుజానికి సర్జరీ కారణంగా మళ్లీ షూటింగ్ ఆలస్యం కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం పట్టే అవకాశం ఉంది. ఎలాంటి సమయంలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ కారణంగా ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్ , నవీన్ ఎర్నేని నిర్మిస్తుండగా.. ప్రముఖ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది.
