Begin typing your search above and press return to search.

పులికి చలితో పనేంటి?.. నైట్ షూట్ కు తారక్ రెడీ..

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు శాండల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   1 Dec 2025 6:00 AM IST
పులికి చలితో పనేంటి?.. నైట్ షూట్ కు తారక్ రెడీ..
X

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు శాండల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ మధ్య చిన్న బ్రేక్ ఇచ్చినా ఇప్పుడు జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు మేకర్స్.

ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరికొద్ది రోజుల్లో రామోజీ ఫిల్మ్ సిటీలో నైట్ షూట్ ను స్టార్ట్ చేయనున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మొదలు కానున్న ఆ షూట్ కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఆ షెడ్యూల్ లో సినిమాలోని కీలకమైన సీన్స్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం చలి బీభత్సంగా ఉంది. కొద్ది రోజులుగా టెంపరేచర్ రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్ లో నమోదవుతోంది. దానికి తోడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకా కూల్ గా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో మేకర్స్ ఇప్పుడు నైట్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విషయం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. ఎంత చలి ఉన్నా.. దాంతో తమ పులికి పనేంటి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. తారక్ డెడికేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో గుర్తు చేస్తున్నారు. ఆడియన్స్ ను అలరించేందుకు.. మంచి అవుట్ పుట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా ఎన్టీఆర్ చేస్తారని అంటున్నారు.

అయితే సినిమాలో తారక్.. నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించనున్నారని ఇప్పటికే తెలుస్తోంది. సినిమా కోసం కొన్ని కిలోల బరువు తగ్గినట్లు కనిపిస్తోంది. ఫుల్ వర్కౌట్స్ కూడా చేస్తున్నారు. రోల్ కు తగ్గట్టు పెర్ఫెక్ట్ గా ఉండేందుకు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ లుక్ తో సర్ప్రైజ్ చేయనున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.

ఇక సినిమా విషయానికొస్తే.. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మాలీవుడ్ నటుడు టోవినో థామస్ విలన్ గా యాక్ట్ చేయనున్నారని.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా సినిమాలో భాగమయ్యారని సమాచారం. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.