ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. టైటిల్ సస్పెన్స్ వీడేది అప్పుడే..
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
By: M Prashanth | 21 April 2026 11:26 AM ISTమ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి ఒక భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసినప్పటి నుండి, నందమూరి అభిమానులు ఈ ప్రాజెక్ట్ గురించి ప్రతి అప్‌డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? టైటిల్ ఏం పెడతారు? అనే విషయాలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక పక్కా క్లారిటీ ఇచ్చేశారు.
ఎన్నో వాయిదాల తర్వాత, ఫైనల్ గా ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ జూన్ 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మొదట ఈ సినిమాను 2026 మొదట్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రశాంత్ నీల్ పర్ఫెక్షన్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటుండటంతో, షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత 2026 సమ్మర్ లో అనుకున్నా కుదరలేదు. ఎట్టకేలకు 2027 సమ్మర్ బరిలో ఈ భారీ చిత్రాన్ని నిలుపుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ప్రస్తుతానికి రిలీజ్ డేట్ మాత్రమే కన్ఫర్మ్ చేశారు కానీ, టైటిల్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ చర్చల్లో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ విడుదల చేసిన పోస్టర్ లో ఎక్కడా ఆ పేరు వాడలేదు. కేవలం #NTRNeel అనే హ్యాష్ ట్యాగ్ తోనే పోస్టర్ ను డిజైన్ చేశారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. బహుశా ఆ గ్లింప్స్ లోనే సినిమా అసలు టైటిల్ ను రివీల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాలోనూ హీరోయిజం ఎలివేషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎన్టీఆర్ లాంటి పవర్ ఫుల్ నటుడు తోడవ్వడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దేవర సినిమాతో సోలోగా 500 కోట్ల మార్కును అందుకున్న తారక్, ఇప్పుడు నీల్ తో కలిసి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా.
చాలా రోజులు తరువాత ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో బాక్సాఫీస్ వద్ద వేడి మొదలైంది. 2027 సమ్మర్ లో ఈ సినిమా సృష్టించే అలజడి ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక మే 20న వచ్చే గ్లింప్స్ లో ప్రశాంత్ నీల్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో, అసలు టైటిల్ ఏంటో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
