తారక్ నీల్.. పవర్ ఫుల్ టచ్ ఇస్తున్నారా?
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్స్ లో ఒకటిగా నిలిచిన ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రాజెక్ట్ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
By: M Prashanth | 5 May 2026 5:00 PM ISTటాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్స్ లో ఒకటిగా నిలిచిన ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రాజెక్ట్ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ భారీ పాన్ ఇండియా మూవీపై తాజా అప్డేట్లు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఆ సినిమాను ప్రశాంత్ నీల్ తన కెరీర్ లోనే బెస్ట్ గా నిలబెట్టాలనే టార్గెట్ తో ఎంతో కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం.
కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో తన స్పెషల్ మేకింగ్ స్టైల్ ను నిరూపించుకున్న ప్రశాంత్ నీల్, ఈసారి మరింత స్ట్రాంగ్ స్టోరీతో పాటు పవర్ ఫుల్ ఎలివేషన్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రిప్ట్ డెవలప్మెంట్ కు ఎక్కువ సమయం కేటాయించడం ప్రాజెక్ట్ పై ఆయన సీరియస్ నెస్ ను చూపిస్తోంది. యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్ కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
తాజాగా వినిపిస్తున్న ఆసక్తికరమైన వార్త ఏమిటంటే.. చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం దర్శకుడు దేవ కట్టను టీమ్ లోకి తీసుకున్నారన్నది. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో ఆయన రాసిన డైలాగులకు మంచి పేరుంది. ముఖ్యంగా సామాజిక అంశాలను స్ట్రాంగ్ గా రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆయన రైటింగ్ ఉండటం ప్రత్యేకత.
ఇప్పుడు అదే శైలి డ్రాగన్ సినిమాలో కనిపించొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దేవ కట్ట వంటి రైటర్ ప్రాజెక్ట్ లో భాగమైతే, సినిమాకు మరింత పవర్ ఫుల్ టచ్ వచ్చే అవకాశం ఉందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ కు ఆయన రాసే గట్టి డైలాగులు తోడైతే, థియేటర్లలో ఆ ప్రభావం మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇది కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ గానే కాకుండా, కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని టాక్.
ఇక సినిమా విషయానికి వస్తే.. హీరోయిన్ గా కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంగీత బాధ్యతలు రవి బస్రూర్ చేపట్టడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
సినిమాలో తారక్ మాస్ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా పాత్రను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్నీ కలిసొస్తే అభిమానులకు పండగ వాతావరణం ఖాయం. ఇప్పటికే షూటింగ్ స్పీడ్ గా జరుగుతుండగా, ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ విజన్, ఎన్టీఆర్ ఎనర్జీ, దేవ కట్ట రైటింగ్.. అన్నీ కలిసి వస్తే డ్రాగన్ కంప్లీట్ మాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బజ్ ను చూస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
