ప్రశాంత్ నీల్ క్రేజీ సర్ ప్రైజ్.. డ్రాగన్ తో తారక్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా డ్రాగన్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.
By: M Prashanth | 31 Aug 2025 8:30 AM ISTజూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా డ్రాగన్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. పలు షెడ్యూళ్లలో చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ రూమర్ బయటకు వచ్చింది.
అయితే ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. సినిమా సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు.. ఫుల్ ఎమోషన్స్ సీన్స్ ఉంటాయట. అందుకు తగ్గట్లే, సెకండ్ హాఫ్ లో తారక్ పాత్ర పై ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ప్లాన్ చేశారని తెలిసింది.
ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పాత్ర.. ఫుల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని తెలుస్తోంది . ఈ మేరకు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం ప్రత్యేకంగా టైమ్ తీసుకుంటున్నాడట. ఈ ఫ్లాష్ బ్యాక్ కు థియేటర్లలో విజిల్స్ పడడం ఖాయమని, ఫ్యాన్స్ కు ఇది గూస్ బంప్స్ వస్తాయని అంటున్నారు.
ఇక ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నట్లు టాక్. తారక్ కెరీర్ లోనే దీన్ని అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నారు. అటు కెజీఎఫ్ సినిమాలు, సలార్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ చిత్రాలు ఆయన క్యాలీబర్ ను పెంచేశాయి. ఈ సినిమాలకు పాన్ఇండియా రేంజ్ లో ఆదరణ దక్కాయి. దీంతో డ్రాగన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా ఇదే అత్యుత్తమ చిత్రం అవుతుందని అంచనాలు కూడా ఉన్నాయి.
కాగా, ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా రూపొందుతోంది.
