Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ 'డ్రాగ‌న్' టీమ్‌కు మ‌ల‌యాళ స్టార్ షాక్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ భారీ యాక్ష‌న్ డ్రామాని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే.

By:  Ravindar Gorantla   |   31 March 2026 6:49 PM IST
ఎన్టీఆర్ డ్రాగ‌న్ టీమ్‌కు మ‌ల‌యాళ స్టార్ షాక్‌!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ భారీ యాక్ష‌న్ డ్రామాని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కేజీఎఫ్ సీరిస్‌, స‌లార్ వంటి హ్యూజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ల త‌రువాత ప్ర‌శాంత్ నీల్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం, అందులో ఎన్టీఆర్‌తో చేస్తున్న ఫ‌స్ట్ ఫిల్మ్ కావ‌డంతో దీనిపై అంచ‌నాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుపుకుంటోంది.

ఇందులో క్రేజీ స్టార్స్ చాలా వ‌ర‌కు న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ అనిల్ క‌పూర్‌, మ‌ల‌యాళ న‌టుడు బీజు మీన‌న్ న‌టిస్తున్నారు. అయితే వీరితో పాటు మ‌ల‌యాళ హీరో టోవినో థామ‌స్ కూడా కీల‌క పాత్ర‌లో ప‌వర్ ఫుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నార‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై మ‌ల‌యాళ హీరో టొవినో థామ‌స్ క్లారిటీ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ `డ్రాగన్‌` టీమ్‌కు షాక్ ఇచ్చార‌ని చెప్పొచ్చు.

టొవినో థామ‌స్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `ప‌ళ్లి చ‌ట్టంబి`. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన టొవినో థామ‌స్ `డ్రాగ‌న్‌`పై అడిగిన ప్ర‌శ్న‌కు షాకింగ్ స‌మాధానం చెప్పారు. ఎన్టీఆర్ డ్రాగ‌న్ మూవీలో మీరు న‌టిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయ‌ని తెలిసింది అని అడిగితే డేట్స్ స‌ర్దుబాటు చేయ‌డం చాలా హ‌ర్డ్‌గా వుంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో నేను న‌టించ‌డం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పి షాక్ ఇచ్చారు. ప‌లు ప్రాజెక్ట్‌ల‌లో టొవినో థామ‌స్ న‌టిస్తున్నారు. ఆ కార‌ణంగా `డ్రాగ‌న్‌`కు డేట్స్ కేటాయించ‌డం చాలా క‌ష్టంగా మారింద‌ట‌.

ఆ కార‌ణంగానే త‌ను ఈ ప్రాజెక్ట్‌లో న‌టించడం లేద‌ని చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ కు గుర‌వుతున్నారు. టొవినో మ‌ల‌యాళంలో మంచి ప్రొటెన్షియ‌ల్ ఉన్న న‌టుడు. అలాంటి వ్య‌క్తి న‌టిస్తే బాగుంటుంద‌ని అంతా భావించారు. కానీ టొవినోకున్న బిజీ షెడ్యూల్స్ కార‌ణంగా `డ్రాగ‌న్‌`కు డేట్స్ కేటాయించ‌లేని ప‌రిస్థితి. దాంతో ఈ ప్రాజెక్ట్‌ని వ‌దిలేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ `డ్రాగ‌న్‌`లో ప‌వర్ ఫుల్ డాన్‌గా న‌టిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంత‌ర్జాతీయ మాఫియా డాన్‌గా ప‌వర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని, ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్‌లో య‌ష్ క్యారెక్ట‌ర్‌ని ఏ స్థాయిలో ప‌వ‌ర్ ఫుల్‌గా చూపించాడో అంత‌కు మించి ఇందులో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇండియా, చైనా బోర్డ‌ర్ లో సాగే యాక్ష‌న్ డ్రామాగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ 40 దేశాల‌ని శాసించే ప‌వ‌ర్ ఫుల్ డాన్‌గా క‌నిపిస్తారని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.