Begin typing your search above and press return to search.

తారక్ నమ్మకాన్ని నీల్ నిలబెట్టుకుంటారా?

దీంతో తారక్.. నీల్ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25వ తేదీన థియేటర్స్ లో రానున్నారు. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ గా మారింది.

By:  M Prashanth   |   31 Aug 2025 3:00 PM IST
తారక్ నమ్మకాన్ని నీల్ నిలబెట్టుకుంటారా?
X

కేజీఎఫ్-2, సలార్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ చిత్రంలో సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణీ వసంత్ కథానాయికగా కనిపించనుంది.

ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో ఎప్పటి నుంచి టాక్ వినిపిస్తోంది. కానీ మేకర్స్ దానిని అధికారికంగా ప్రకటించలేదు.

అయితే తారక్ లైనప్ లో అనేక సినిమాలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు నీల్ తో చేస్తున్న మూవీపై ఆయన భారీ హోప్స్ పెట్టుకున్నారని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా ఆయన నటించిన బాలీవుడ్ డెబ్యూ వార్-2 మూవీ బోల్తా పడింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. తెలుగు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు.

దీంతో తారక్.. నీల్ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25వ తేదీన థియేటర్స్ లో రానున్నారు. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ గా మారింది. పాన్ ఇండియా చిత్రాలను రూపొందించే టాలెంట్ ఫుల్ గా ఉన్న నీల్.. ఇప్పుడు తారక్ మూవీని వేరే రేంజ్ లో తీస్తున్నారట.

ప్రశాంత్ నీల్ సూచనలను తారక్ అన్నీ ఫాలో అవుతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆయనపై భారీ నమ్మకాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా నీల్ ఫోకస్ కు కట్టుబడి ఉన్నారని సమాచారం. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ నమ్మకాన్ని నీల్ ఎంతవరకు నెలబెట్టుకుంటారో.. ఎలాంటి హిట్ అందిస్తారో ఆసక్తికరం.

అయితే రీసెంట్ గా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఉత్తర కన్నడలోని కుంటాలో జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ ఒక ఫ్యాక్టరీ సెట్ ను నిర్మించారని సమాచారం. 10 రోజులకు పైగా షూటింగ్ అక్కడే జరిగిందట. ఇప్పుడు తారక్ రిలాక్సడ్ మోడ్ లో ఉన్నారని టాక్. మరికొద్ది రోజుల్లో కొత్త షెడ్యూల్ మొదలుకానుందని వినికిడి. హైదరాబాద్ లో భారీ వ్యయంతో సెట్ ను నిర్మిస్తున్నారట.