మాట నిలబెట్టు కోబోతున్న ఎన్టీఆర్!
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ప్రేక్షకులను మెప్పించడానికి తమ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ అలరిస్తున్నారు.
By: Madhu Reddy | 11 Oct 2026 10:00 PM ISTఇటీవల కాలంలో సెలబ్రిటీలు ప్రేక్షకులను మెప్పించడానికి తమ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ అలరిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ పెర్ఫార్మన్స్ చేస్తున్నప్పుడు ఎటువంటి డూప్ లేకుండా కష్టపడి మరీ పాత్రలకు ప్రాణం పోస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కసారి విపరీతమైన యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు అనుకోకుండా జరిగే గాయాలు సెలబ్రిటీలను కొంతకాలం ఇంటికే పరిమితం చేస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్, బాలకృష్ణ, రష్మిక మందన్న, ఎన్టీఆర్ లాంటి సెలబ్రిటీలు సినిమా షూటింగ్ ల సమయంలో క్లిష్టమైన సన్నివేశాలలో స్వయంగా నటించి , గాయాల బారిన పడ్డ విషయం తెలిసిందే.
వాటి నుండి బయటపడడానికి సర్జరీలు కూడా చేయించుకున్నారు. ఇక ఒక్కొక్కరిగా తమ ఆరోగ్య సమస్యల నుండి బయటపడి సినిమా షూటింగ్ సెట్లోకి అడుగుపెడుతుంటే.. ఇటు ఎన్టీఆర్ కూడా తన సినిమా షూటింగును తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అయ్యారు. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఆయన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే భుజానికి గాయం కావడంతో దాదాపు కొన్ని వారాలపాటు ఇంటికే పరిమితమయ్యారు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు గాయం కాస్త తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆయన మళ్లీ సినిమా సెట్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు.
ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈనెల 14వ తేదీ నుంచి డ్రాగన్ యాక్షన్ మోడ్ లోకి దిగనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాదులోని ఆర్ఎఫ్సి లో జరిగే షెడ్యూల్లో ఆయన పాల్గొంటారని తెలిపాయి. కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడ ముగిస్తారని సమాచారం .దీంతో ఫాన్స్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ తన మాటను నిలబెట్టు కోబోతున్నారా అనే కామెంట్లు వ్యక్త మవుతున్నాయి.
విషయంలోకి వెళ్తే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి.. తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ తొలి నిర్మాణంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ పాల్గొని ఈ సినిమాను అనుకున్న తేదీకి కచ్చితంగా తీసుకొస్తామని ప్రకటించారు. అలా 2027 జూన్ 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే
అందు కోసమే ఎన్టీఆర్ త్వరగా యాక్షన్ మోడ్ లోకి వెళ్ళనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే నిజమైతే ఎన్టీఆర్ తన అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టు కోబోతున్నారు అనే కామెంట్లు వ్యక్తం అవుతాయి అనడంలో సందేహం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పూర్తిగా కలర్ ఫుల్ గా సరికొత్త విజువల్ వండర్ గా ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలు అంటేనే డార్క్ బ్లాక్ అండ్ గ్రే షేడ్స్ లో ఉండడం అందరికీ తెలిసిందే. మరి ఎన్టీఆర్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలిసారి కలర్ఫుల్ స్క్రీను ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించబోతుందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
