Begin typing your search above and press return to search.

''సెన్సేష‌న్స్‌ దాచి ఉంచాము''- 'నీల్‌'కి విష్ చేసాడా! 'డ్రాగ‌న్‌' పై లీకిచ్చాడా?

ఇండియన్ సినిమా రంగంలో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లలో ఒకటిగా ఎన్టీఆర్- నీల్ గురించి ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. డ్రాగ‌న్ (NTR31) అనే టైటిల్ తో ప్ర‌స్తుతం భారీ పాన్ ఇండియ‌న్ సినిమా సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   4 Jun 2026 11:14 AM IST
సెన్సేష‌న్స్‌ దాచి ఉంచాము- నీల్‌కి విష్ చేసాడా! డ్రాగ‌న్‌ పై లీకిచ్చాడా?
X

ఇండియన్ సినిమా రంగంలో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లలో ఒకటిగా ఎన్టీఆర్- నీల్ గురించి ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. డ్రాగ‌న్ (NTR31) అనే టైటిల్ తో ప్ర‌స్తుతం భారీ పాన్ ఇండియ‌న్ సినిమా సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అటు నందమూరి అభిమానుల్లోనూ.. ఇటు యాక్షన్ ప్రియుల్లోనూ అపారమైన అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నేడు (4 జూన్) దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రత్యేక పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఆత్మీయ అభినందన సందేశం వీరిద్దరి క్రేజీ కాంబో మూవీపై ఉన్న హైప్‌ను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది.

జూనియర్ ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన‌ ఈ బర్త్‌డే విష్‌లో ప్రశాంత్ నీల్‌పై తనకున్న గౌరవాన్ని, నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ''హ్యాపీ బర్త్‌డే డైరెక్టర్ గారూ... మీరు వెండితెరపై ఆవిష్కరించే కథల లాగే ఈ ఏడాది కూడా మీకు అంతే గ్రాండ్‌గా, అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను'' అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ''ప్రశాంత్... మన కాంబినేషన్‌ మునుముందు ఎలాంటి సంచలనాలను దాచి ఉంచిందో చూడటానికి నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను!'' అంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఎంత పవర్‌ఫుల్‌గా సిద్ధమైందో పరోక్షంగా స్పష్టం చేస్తోంది..

ఈ పుట్టినరోజు శుభాకాంక్షల పోస్ట్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన వర్కింగ్ స్టిల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ చిత్రంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్న సెట్స్‌లో చేతిలో మైక్ పట్టుకుని సీరియ‌స్ గా ఆలోచిస్తూ నడుస్తూ కనిపిస్తున్నారు. ఆయన వెనుక భాగంలో కొందరు మనుషులు కింద పడిపోయి ఉండటం... నేలపై మంటలు మండుతుండటం ఆస‌క్తిని మ‌రింత పెంచుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ అయిన రా అండ్ రస్టిక్ యాక్షన్ వాతావరణం ఈ స్టిల్‌లో స్పష్టంగా కనిపిస్తుండటంతో ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతున్నారోననే క్యూరియాసిటీ మ‌రింత పెరుగుతోంది.

కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి ఇండస్ట్రీ హిట్లతో పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఘనత ప్రశాంత్ నీల్‌ సొంతం. తన సినిమాల్లో హీరోలను అత్యంత ప‌వ‌ర్ ఫుల్ ఎలివేషన్లతో కళ్ళు చెదిరే యాక్షన్ డ్రామాతో ప్రెజెంట్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. మరోవైపు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తన ఎదురేలేని నటన -ఎన‌ర్జీతో, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో ఏ పాత్రనైనా విశ్వరూపం చూపించ‌గల నేర్ప‌రి. ఈ ఇద్దరు పవర్‌హౌస్ ప్రతిభావంతులు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం వల్ల.. ఈ చిత్రం ఇండియ‌న్ సినిమాని మరోసారి గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే కమర్షియల్ వండర్ సిద్ధ‌మ‌వుతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎన్టీఆర్ షేర్ చేసిన‌ ఈ లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో దూసుకుపోతూ, ట్రెండింగ్‌లో నిలిచింది.

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీపై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరిన ఈ టైమ్ లో తార‌క్ విషెస్ సందేశం నిజంగా ఉత్కంఠ‌ను పెంచుతోంది. ముఖ్యంగా అత‌డు త‌న కామెంట్ లో సంచ‌ల‌నాల‌ను దాచి పెట్టామ‌ని హింట్ ఇవ్వ‌డం చూస్తుంటే, ఈ సంచ‌లనాల‌ను ఫ్యాన్స్ కోసం తొంద‌ర‌లోనే రివీల్ చేస్తార‌ని ఆశిస్తున్నారు.

ప్రశాంత్ నీల్ చిత్రాల్లో ఉండే ప్రత్యేకమైన `డార్క్ అండ్ రస్టిక్` యాక్షన్ ప్రపంచం, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హై-వోల్టేజ్ ఎమోషన‌ల్ స్టార్ తో ఎలివేట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాల‌నే ఆత్రం అంత‌కంత‌కు పెరుగుతోంది. నీల్ డ్రాగ‌న్- కేవలం బాక్సాఫీస్ రికార్డులను తిర‌గ‌రాయ‌డ‌మే కాకుండా.. ఇండియన్ కమర్షియల్ సినిమా మేకింగ్ శైలిలోనే ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేయగలద‌ని న‌మ్ముతున్నారు.