Begin typing your search above and press return to search.

'ఏది రాసుంటే అది జరుగుతుంది'.. తారక్ పొలిటిక్స్ పై దగ్గుబాటి ఇలా!

ఇప్పుడు తారక్ పొలిటికల్ రీఎంట్రీపై నందమూరి అల్లుడు, సీనియర్ రాజకీయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.

By:  M Prashanth   |   27 Aug 2025 11:48 AM IST
ఏది రాసుంటే అది జరుగుతుంది.. తారక్ పొలిటిక్స్ పై దగ్గుబాటి ఇలా!
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చే విషయం ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. గతంలో టీడీపీ కోసం ప్రచారం చేసిన ఆయన.. ఆ తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్ గా ఉంటున్నారు. ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. ఇప్పుడు తారక్ పొలిటికల్ రీఎంట్రీపై నందమూరి అల్లుడు, సీనియర్ రాజకీయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో.. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉన్నారా.. దూరం పెట్టారా.. మీరెప్పుడూ పాజిటివ్ గా మాట్లాడుతారు.. అని హోస్ట్ అడగ్గా.. తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన దేశం గర్వించదగ్గ నటుడు, ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదని చెప్పారు. ఒక్కసారి చూస్తే పేజీలు పేజీల డైలాగ్స్ అలవోకగా చెప్పేస్తాడని అన్నారు.

అది రామారావు గారి నుంచి తారక్ కు వచ్చిన వరమని దగ్గుబాటి పేర్కొన్నారు. ఆ రకంగా నిబద్ధతతో ఉన్నారని, ఆ శిఖరాలకు ఎదుగుతారని తెలిపారు. పొలిటికల్ గా రావాలంటే ఎప్పుడైనా రావొచ్చని, కానీ శిఖరాలకు అందుకునేందుకు ఇంకా ఎదగాల్సి ఉందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు.. ఆశీర్వదించాలని అన్నారు.

ఉన్నత శిఖరాలను అందుకోవాలని, ఎక్కడున్నా మంచిగా ఉండాలని అనుకోవాలని తెలిపారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తారక్ సుడిగాలి పర్యటన చేపట్టిన విషయంపై స్పందించారు. జీవితంలో ఏది జరగాలనుకుంటే అది జరుగుతుందనే సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. తనకు రాజ్యసభ సీటు దక్కిన విషయంపై మాట్లాడారు.

తాను ఎవరినీ అడగకపోయినా, చేసిన తాను గెలిచానని తెలిపారు. రాసుంది కాబట్టి అలా జరిగిందని చెప్పారు. అయితే రాజకీయ ముందు చూపుతో ఎన్టీఆర్ తో టీడీపీలో కీలక పాత్ర ఉంటుందా, రాజకీయ భవిష్యత్తు ఉంటుందా, ఉండనిస్తారా అని అడగ్గా.. దగ్గుబాటి మాట్లాడారు. ఎన్ టీ రామారావు గారికి 260 సీట్లు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనను తాను కళ్లారా ముందు చూశానని గుర్తు చేసుకున్నారు.

పీవీ నరసింహారావు గారిని నా కళ్ల ముందు ఒక్కరే తిరగడం చూశానని, ఆ తర్వాత రెండు నెలలకు ప్రధానమంత్రిగా చూశానని తెలిపారు. దేవెగౌడ గారిని వెనుక సీట్లలో నిద్రపోయేవారని, అనంతరం పీఎంగా కనిపించారని చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూ చెప్పలేరని అన్నారు. ఏది ఎప్పుడు నిర్ణయించబడుతుందో అది దైవ నిర్ణయమని పేర్కొన్నారు దగ్గుబాటి.