Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ కొత్త లుక్..

కానీ సడన్గా ఎన్టీఆర్ కి సంబంధించిన కొత్త లుక్ వైరల్ అవ్వడంతో ఇప్పటివరకు ఎన్టీఆర్ ని ట్రోల్ చేసిన నోళ్ళన్ని మూత పడిపోయాయి.

By:  Madhu Reddy   |   7 Dec 2025 1:52 PM IST
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ కొత్త లుక్..
X

సినీ సెలబ్రిటీలు ఏం చేసినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారుతుంది. వాళ్లు వెరైటీ డ్రెస్ వేసినా.. కొత్త లుక్ లో కనిపించినా అభిమానులు ఆ లుక్ ని తెగ వైరల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కొత్త లుక్ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. జీన్స్ ప్యాంట్,షర్ట్ ధరించిన ఎన్టీఆర్.. స్టైల్ గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని గాగుల్స్ పెట్టుకొని.. చేతులు కట్టుకొని సోఫాలో కూర్చున్న ఒక ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.. ఈ ఫోటోలో ఎన్టీఆర్ తన చేతికి పెట్టుకున్న వాచ్ కూడా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.

అలాగే ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా సన్నగా కూడా కనిపిస్తున్నారు. అయితే తాజాగా మలబార్ యాడ్ లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోల్స్ రాగా..ఈ ఫోటోపై మాత్రం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోఫాలో కూర్చున్న ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా ఉన్నారని ఆయన లుక్ అద్భుతంగా ఉంది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మలబార్ యాడ్ పై ట్రోలింగ్ జరిగిన రెండు రోజులకే మళ్ళీ ఎన్టీఆర్ కి సంబంధించిన న్యూ లుక్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది షాక్ అవుతున్నారు. ఇదేంటి ఇంత తొందరగా ఎన్టీఆర్ లుక్ చేంజ్ చేసుకున్నారు అని షాక్ అయిపోతున్నారు.

అయితే మలబార్ యాడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గుబురు గడ్డంతో చాలా సన్నబడి కనిపించడంతో కొంతమంది నెటిజన్స్ ఆయన లుక్ పై ట్రోలింగ్ చేశారు.ఇదేంటన్న ఇలా మారిపోయావ్.. బక్క చిక్కిపోయి గుబురు గడ్డంతో ఉన్నావ్.. అసలు గుర్తు పెట్టలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేశారు.

కానీ సడన్గా ఎన్టీఆర్ కి సంబంధించిన కొత్త లుక్ వైరల్ అవ్వడంతో ఇప్పటివరకు ఎన్టీఆర్ ని ట్రోల్ చేసిన నోళ్ళన్ని మూత పడిపోయాయి. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ తన లుక్ మొత్తం చేంజ్ చేసుకున్నారు. దేవర సినిమాలో తన లుక్ తో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం చాలా సన్నబడిపోయారు. ఈయన ప్రశాంత్ నీల్ మూవీ కోసం సన్నబడడంతో ఎంతోమంది నెటిజన్లు ఎన్టీఆర్ కి ఏమైపోయింది..? ఆరోగ్యం బాలేదా..?ఎందుకు అంత సన్నబడిపోయారని అభిమానులు ఆందోళన చెందారు.

కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసమే అలా సన్నబడ్డారని ఆ తర్వాత అర్థమైంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తున్న సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ బాడీ డబుల్ లేకుండా స్వయంగా స్టంట్స్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ల మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.