Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఎన్టీఆర్‌ సతీసమేత ట్రిప్‌

ఎన్టీఆర్‌ గత కొన్నాళ్లుగా షూటింగ్‌కు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. చేతికి అయిన గాయం కారణంగా ఎన్టీఆర్‌ సుదీర్ఘ కాలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు

By:  Ramesh Palla   |   7 Oct 2026 11:45 AM IST
పిక్‌టాక్‌ : ఎన్టీఆర్‌ సతీసమేత ట్రిప్‌
X

ఎన్టీఆర్‌ గత కొన్నాళ్లుగా షూటింగ్‌కు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. చేతికి అయిన గాయం కారణంగా ఎన్టీఆర్‌ సుదీర్ఘ కాలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. చేతికి అయిన గాయం నుంచి పూర్తిగా కోలుకున్న వెంటనే డ్రాగన్‌ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్‌ పాల్గొంటాడని విషయం తెల్సిందే. ఇటీవల డోంట్ ట్రబుల్‌ ది ట్రబుల్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ పాల్గొని చిత్ర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ అంతా బాగానే అనిపించాడు. కానీ చేయిని ఎక్కువగా మూవ్‌ చేయలేక పోతున్నాడు. ఆ చేతితో బలంగా తొడ కూడా కొట్టలేక పోయాడు అనే విషయం మనం చూశాం. చేయికి ఇంకాస్త విశ్రాంతి కావాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ మరికొన్ని రోజులు షూటింగ్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. ఒకసారి డ్రాగన్‌ షూట్‌ ప్రారంభం అయితే గుమ్మడి కాయ కొట్టే వరకు రెగ్యులర్‌ డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇటలీలో ఫ్యామిలీతో ఎన్టీఆర్‌...

డ్రాగన్‌ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడం కోసం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాదిలో సినిమా విడుదల చేయాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. ఎన్టీఆర్‌ ఇన్నాళ్లు చేయి గాయం, ఇతర కారణాల వల్ల ట్రిప్‌కు వెళ్లలేక పోయాడు. ఫైనల్‌గా డ్రాగన్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభంకు ముందు ఎన్టీఆర్‌ ఇటలీ ట్రిప్‌ వెళ్లాడు. సతీ సమేతంగా ఎన్టీఆర్‌ ఇటలీ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఇటలీ ట్రిప్‌ కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ ఫారిన్‌ ట్రిప్స్‌ చాలా అరుదుగా వెళ్తూ ఉంటాడు. వెళ్లిన ప్రతిసారి భార్య లక్ష్మీ ప్రణవితోనే ఎన్టీఆర్‌ వెళ్తూ ఉంటాడు. ఈసారి కూడా సతీసమేతంగా వెళ్లి అక్కడ స్నేహితులతో కలిసి ఎన్టీఆర్‌ ట్రిప్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఎప్పుడూ బిజీగా ఉండే ఎన్టీఆర్ ఇలా ట్రిప్స్ ను ఆస్వాదించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అని ఫోటోలను ఫ్యాన్స్ షేర్‌ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

డ్రాగన్‌ షూటింగ్‌ కోసం ఎన్టీఆర్‌ రెడీనా...?

సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ ఇటలీ ట్రిప్ ఫోటోలు వైరల్‌ కావడంతో అంతా కూడా డ్రాగన్‌ సినిమా కోసం ఎన్టీఆర్‌ పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్నాడని, ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. భారీ అంచనాల నడుమ మైత్రి వారు నిర్మిస్తున్న డ్రాగన్‌ సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ ను టచ్‌ చేస్తుందనే విశ్వాసంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నాయి. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా కావడంతో అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సినిమాను చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీని దాదాపు ఐదేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఫైనల్‌గా సినిమా ప్రారంభం అయింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌...

ఎన్టీఆర్‌ డ్రాగన్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తే పూర్తి అయ్యే వరకు మరే సినిమా షూటింగ్‌కు హాజరు కాడని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు డ్రాగన్‌ ను పూర్తి చేసి, త్రివిక్రమ్‌ చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్న ప్రాజెక్ట్‌ ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో కోసం అభిమానులు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ తీసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా వీరి కాంబో మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పీరియాడిక్‌, సైన్స్ ఫిక్షన్‌, ఫాంటసీ సినిమాలు ఎక్కువ వస్తున్న విషయం తెల్సిందే. వాటికి మంచి ఆధరణ సైతం లభిస్తుంది. అందుకే ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌లు మైథలాజికల్ యాక్షన్ ఎపిక్ ను తీసుకు వస్తారని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నట్లు ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.