Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కి సర్జరీ పూర్తి.. కానీ?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక ఊరటనిచ్చే వార్త. ఇటీవల సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయపడిన తారక్ భుజానికి హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేశారు.

By:  Madhu Reddy   |   12 Aug 2026 10:45 PM IST
ఎన్టీఆర్ కి సర్జరీ పూర్తి.. కానీ?
X

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక ఊరటనిచ్చే వార్త. ఇటీవల సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయపడిన తారక్ భుజానికి హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేశారు. సర్జరీ విజయవంతంగా ముగిసిందని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ హెల్త్ బులెటిన్ బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.




షూటింగ్‌లో అనుకోని ప్రమాదం :

ఇక డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగింది. ఓ భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందారు.

కిమ్స్ వైద్యుల నేతృత్వంలో శస్త్రచికిత్స:

ఈ రోజు కిమ్స్ ఆస్పత్రిలో నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఎన్టీఆర్‌కు విజయవంతంగా సర్జరీ చేశారు. ఇక డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్‌రావు, డాక్టర్ శ్రీనివాస్‌రావు సూరపనేని ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ పూర్తయింది. వైద్యుల బృందం ఎంతో చాకచక్యంగా ఈ శస్త్రచికిత్సను పూర్తి చేసినట్లు తెలిపారు.

ఆసుపత్రి బులెటిన్ విడుదల:

సర్జరీ అనంతరం కిమ్స్ మెడికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ హెచ్‌ఓడీ డాక్టర్ సంబిత్ సాహు అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇక శస్త్రచికిత్స అంతా విజయవంతంగా జరిగిందని, ప్రస్తుతం తారక్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఎప్పుడు కోలుకుంటారు?:

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో ఆయనకు విశ్రాంతి చాలా అవసరమని, ఆ తర్వాతే సాధారణ స్థితికి వచ్చి మళ్లీ షూటింగ్‌లలో పాల్గొంటారని చెప్పారు. ఇక దీంతో కొద్దిరోజుల పాటు 'డ్రాగన్' షూటింగ్‌కు విరామం లభించనుంది.

ఎన్టీఆర్ సర్జరీ సక్సెస్ కావడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రియతమ నటుడు త్వరగా కోలుకుని, మళ్లీ మునుపటి జోష్‌తో షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టి, తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో వెండితెరపై రచ్చ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.