ఎన్టీఆర్ నీల్ మూవీకి సడన్ బ్రేక్.. ఏం జరిగింది?
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు.
By: M Prashanth | 21 Jan 2026 12:54 PM ISTటాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఒకటి. 'దేవర' లాంటి మాస్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నీల్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తరుణంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా ఈ ఫైట్ సీన్స్‌లో పాల్గొంటున్నారు. అయితే గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ హెవీ షెడ్యూల్ వల్ల చిత్ర యూనిట్ అంతా చాలా బిజీగా గడుపుతోంది.
కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనికి కారణం మరేదో కాదు, ఎన్టీఆర్ అనారోగ్యానికి గురవ్వడమే. గత రెండు రోజులుగా ఆయన జలుబు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా యాక్షన్ సీన్స్ చేయడం వల్ల వచ్చిన అలసట, దానికి తోడు వాతావరణంలో మార్పుల వల్ల ఆయన హెల్త్ కొంచెం అప్సెట్ అయిందని సమాచారం.
నటుడి ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని భావించిన ప్రశాంత్ నీల్ ప్రొడక్షన్ టీమ్, వెంటనే షూటింగ్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్‌కు కనీసం కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. కోలుకున్న తర్వాతే మళ్ళీ కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
నిజానికి ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన ఘట్టాలను పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్‌ను చాలా పక్కాగా డిజైన్ చేస్తారు, అందుకే షూటింగ్ ఆగిపోవడం వల్ల షెడ్యూల్స్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఎన్టీఆర్ తన డెడికేషన్‌తో త్వరగానే కోలుకుని మళ్ళీ సెట్స్‌లోకి అడుగుపెడతారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ వచ్చి చాలా కాలమైంది. ముఖ్యంగా సినిమా టైటిల్ డ్రాగన్ అని అనుకుంటున్నప్పటికి ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. ఇక అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే వారం నుండి మళ్ళీ కెమెరా ముందుకు ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
