Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్.. ఫ్యాన్స్ ఏమంటున్నారు?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని వర్కౌట్లు చేసినా.. ఎంత బరువు తగ్గినా ముఖంలో కళ అలాగే ఉంటుంది.

By:  M Prashanth   |   14 Oct 2025 5:20 PM IST
ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్.. ఫ్యాన్స్ ఏమంటున్నారు?
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని వర్కౌట్లు చేసినా.. ఎంత బరువు తగ్గినా ముఖంలో కళ అలాగే ఉంటుంది. ఇది ప్రతి ఒక్క సినీ ప్రియుడికి, అభిమానికి తెలిసిందే. అప్పట్లో కంత్రి సినిమాకు గాను ఎన్టీఆర్ బాగా బరువు తగ్గారు. కానీ ఫేస్ లో గ్రీస్ పోలేదు. యమ దొంగ తర్వాత స్టైలిష్ లుక్ లోకి చేంజ్ అయ్యారు.

ఆ తర్వాత నుంచి మూవీ మూవీకి.. వెయిట్ ను పెంచుకుంటూ వెళ్లారు.. తగ్గించుకుంటూ వచ్చారు.. కానీ అభిమానులు మాత్రం అసంతృప్తికి గురికానివ్వకుండా మెయింటైన్ చేస్తూ వచ్చారు. బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం బరువు పెరిగారు. ఆ తర్వాత చేసిన దేవర మూవీ కోసం తగ్గారు. వార్-2 మూవీ కోసం ఇంకా బరువు తగ్గిపోయారు.

ఫేస్ లో మాత్రం ఎన్టీఆర్ తన కళ పోనివ్వలేదు. కానీ ఇప్పుడు అలా లేదు. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గారు. కళ మాత్రం మిస్ అవ్వడం ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా చేస్తుంది. వార్-2 మూవీ టైమ్ లో కొద్దిగా పర్లేదనిపించినా.. ఇప్పుడు పూర్తిగా బక్కి చిక్కి కనిపిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన బావమరిది పెళ్లిలో తారక్ చాలా సన్నగా కనిపించారు.

ఆ తర్వాత ఇటీవల ఓ ఫ్యాన్ తో ఫోటో దిగారు. బావమరిది నార్నే నితిన్ పెళ్లిలో మెరిసిన ఎన్టీఆర్ కు.. ఇప్పుడు ఫ్యాన్ తో కలిసి దిగిన పిక్ లో ఉన్న తారక్ కు చాలా డిఫరెన్స్ ఉందని చెప్పాలి. దీంతో ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనేక మంది తారక్ అభిమానులు, సినీ ప్రియులు, నెటిజన్లు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు.

సన్నగా ఉన్నా కూడా పర్లేదని, కానీ ముఖంలో అసలు కళ లేదని కామెంట్లు పెడుతున్నారు. సినిమాలో రోల్ కోసమే అంత తగ్గారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అదే సమయంలో టైటిల్ లుక్.. ఇప్పటి లుక్ కు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఇంకొందరు ప్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కోసం ఇలా సన్నగా అయ్యారేమోనని అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా ఇలా తారక్ ను చూడలేకపోతున్నామని పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు సినిమా కోసం అయితే పర్లేదు.. జూనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ కు ఇదే నిదర్శనమని అంటున్నారు. కొత్త మూవీకి ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నారు. త్వరలోనే తమ అభిమాన స్టార్‌ ను శక్తివంతమైన, ఆకర్షణీయమైన వ్యక్తిగా తిరిగి చూడాలని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.