MLAను సస్పెండ్ చేయాలి.. లేకుంటే చలో అనంతపురం: తారక్ ఫ్యాన్స్
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. అనంతపురంలో జరగాల్సిన ప్రెస్ మీట్.. హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
By: M Prashanth | 20 Aug 2025 6:11 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినట్లు ఒక ఆడియో రీసెంట్ గా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో తారక్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అది తన ఆడియో కాదని, ఎవరో కుట్ర చేశారని ఎమ్మెల్యే ఓ వీడియో రిలీజ్ చేసి సారీ చెప్పారు.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. అనంతపురంలో జరగాల్సిన ప్రెస్ మీట్.. హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఏపీలో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. తారక్, కళ్యాణ్ రామ్ ను కలుద్దామని ట్రై చేసినా కుదరలేదని వెల్లడించారు.
"ఇప్పటికే చాలా సార్లు తారక్ కోసం తప్పుగా మాట్లాడారు. మౌనంగా ఉంటే చేతకాని వారు అనుకున్నారు. అందుకే ఇప్పుడు కన్వీనర్స్ అంతా మాట్లాడుకుని అండగా నిలబడాలని అనుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా నందమూరి ఫ్యాన్స్ అంతా ఆవేదన చెందుతున్నారు. శాలిని గారి గురించి నోటికొచ్చినట్లు.. ఎంతోస్తే అంతా.. విర్రవీగి మాట్లాడారు" అని తెలిపారు.
"సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారు. మా హీరో ఏం తప్పు చేశారు. ఎవరు మాట్లాడినా.. ఏ పార్టీ వారు మాట్లాడినా తప్పే.. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సమాజానికి ఇది శ్రేయస్కరం కాదు. శాలిని గారిని ఎన్నో అన్నా కూడా మేం ఎంతో కొంత సైలెంట్ గా ఉన్నామంటే ఎమ్మెల్యే వెనుక సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ జెండా ఉంది" అని చెప్పారు.
"అది పక్కన పెట్టి ఉంటే మా తడాఖా ఏంటో చూపిస్తాం. ఎమ్మెల్యే గారు నా ఆడియో కాదు అంటున్నారు. కానీ ఆయన ఎవరితో మాట్లాడారో ఆ అబ్బాయి వివిధ మీడియాలకు క్లారిటీగా చెప్పాడు. ఫేక్ అని ప్రెస్ మీట్ పెట్టమని ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పాడు. ప్రాణహాని కూడా ఉంది అన్నాడు. అంటే ఇందులో ఫేక్ లేదుగా" అని తెలిపారు.
"తారక్ ఎప్పుడూ టీడీపీలోనే ఉంటానని చెప్పారు. అందుకే మేము కూడా ఫ్యాన్స్ ను పార్టీ బ్యాలెన్స్ చేసుకుని వస్తున్నాం. అదే సమయంలో ఎన్టీఆర్ పేరు మీద స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాం. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదేమైనా దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పాలి. పార్టీ నుంచి సస్పెండ్ అవ్వాలి. లేకుంటే నిరసన కార్యక్రమాలు చేస్తాం. రాజీ పడేది లేదు" అని అన్నారు.
శాలిని గారి కోసం మాట్లాడాల్సిన అవసరం ఏంటి.. తెల్లవారుజూమున మాట్లాడుతవా.. ప్రతిభ గల కొడుకునిచ్చినందుకు గర్వపడాల్సింది పోయి అలా మాట్లాడుతావా అంటూ మరో సభ్యుడు ప్రశ్నించారు. ఎన్ని రకాలుగా జరుగుతున్నా ప్రజల మెప్పు పొందాలని, ఎందులో ఇన్వాల్వ్ అవ్వకూడదని తారక్ తమకు చెప్పినట్లు వెల్లడించారు. కానీ ఆ ఎమ్మెల్యే ఓ తల్లికి కొడుకు అని మర్చిపోయినట్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఓర్పుగా ఉన్నామని, కానీ ఇప్పుడు కాదని అన్నారు. పార్టీ పెద్దలకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
