ఆ స్టార్ హీరో తర్వాత మరో హీరో నోట గొప్ప మాట!
అభిమానం హద్దుల్లో ఉండాలి. అనవసరంగా సినిమాలు చూసి టైమ్ వేస్ట్ చేసుకోవొద్దు. జేబు నిండుగా డబ్బులు ..చేతిలో ఖాళీ సమయం ఉంటేనే సినిమాకు రండి.
By: Srikanth Kontham | 4 Dec 2025 3:00 AM ISTఅభిమానం హద్దుల్లో ఉండాలి. అనవసరంగా సినిమాలు చూసి టైమ్ వేస్ట్ చేసుకోవొద్దు. జేబు నిండుగా డబ్బులు ..చేతిలో ఖాళీ సమయం ఉంటేనే సినిమాకు రండి. లేకపోతే నా సినిమాలు చూడకపోయినా పర్వాలేదు.
అంతే గానీ ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టి..మీరు కూడా ఇబ్బంది పడొద్దని? చెప్పే ధైర్యం ఎంత మంది హీరోలకు ఉంటుంది. అంటే ఈ మాట తొలిసారి తల అజిత్ నోట మాత్రమే వచ్చింది. ఇండియాలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. వారంతా సినిమా రిలీజ్ అవుతుందంటే ఏం చెబుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బాధ్యతగా స్పందించిన హీరో:
తప్పకుండా థియేటర్లో సినిమా చూడండి. ఏ సినిమా మిస్ అయినా ఈ సినిమా మాత్రం మిస్ అవ్వకండని అభిమా నుల బుర్రలోకి ఓ రేంజ్ లో ఎక్కిస్తారు. హీరో మాటనే ఓ శాసనంగా భావించి సినిమా చూడాలనే యావతో జేబులు గుల్లు చేసుకున్న అభిమానులెంతో మంది. ఇలాంటి అభిమానం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. తాజాగా అజిత్ తరహాలోనే మరో స్టార్ హీరో శివ కార్తికేయన్ అభిమానులను ఉద్దేశించి స్పందించిన తీరు చూస్తే వారెంత బాధ్యతగా ఉన్నారు అన్నది అద్దం పడుతుంది. తనకు ఆరాధించే అభిమానులు వద్దన్నారు.
డబ్బు వృద్దా చేయోద్దు:
వారి తల్లిదండ్రులను, దైవాన్ని మాత్రమే ఆరాధించే వారంటేనే ఇష్టమన్నారు. తనని ఒక స్నేహితుడిగా,సోదరడిగా భావించే అభిమానులు మాత్రమే కావాలన్నారు. అలాంటి అభిమానుల్నే తన కుటుంబ సభ్యుడిగా భావిస్తానన్నారు. తన పేరుతో సోషల్ మీడియాలో ఎన్నో ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయన్నారు. కానీ వాటి గురించి తనకు తెలియదన్నారు. వాటిని ఎవరు నిర్వహిస్తున్నారో కూడా తెలియదన్నారు. తనని కేవలం మంచి శ్రేయోభిలాషిగానే చూడాలి తప్ప అభిమానం పేరుతో అనవసర ఖర్చులు చేయోద్దని సూచించారు.
హీరోల్లోనూ మార్పులు రావాలి:
తెలుగు హీరోల్లో ఇలాంటి నటుడు ఒకరున్నారు. అతడే యంగ్ టైగర్ ఎన్టీఆర్. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు తర్వాత తనని అభిమానించాలన్నారు. వాళ్లను కాదని తానెవరో పూర్తిగా తెలియకుండా అభిమా నించడం ఏంటని? చాలా సందర్భాల్లో అభిమానుల తీరును ఉద్దేశించి మాట్లాడారు. అభిమానం అనేది హద్దులు ఎప్పుడు దాటొద్దని పలు వేదికలపై నుంచి సూచించారు తారక్. ఇలా స్టార్ హీరోలంతా అభిమానుల్లో అవేర్ నెస్ తీసుకొచ్చేలా మాట్లాడితే వీపరీత అభిమానం అన్నది అదుపులో ఉంటుంది. అభిమానులు దేవుడిచ్చిన వరమని, ఆ గొప్ప అదృష్టం తనకే దక్కిందని వంటి వ్యాఖ్యలు చేస్తే? అతి అభిమానం అన్నది ఎన్నటికీ అదుపులోకి రాదు.
