పిక్ ఆఫ్ ది డే: బావమరిది పెళ్లిలో తారక్.. ఎంత బాధ్యతగా అంటే..
ఈ పెళ్లికి సంబంధించి అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో తారక్ క్రీమ్ అండ్ గోల్డ్ షేడింగ్ కుర్తాలో, గోల్డ్ కోటింగ్ శారీ ప్రణతి కనిపించారు.
By: M Prashanth | 11 Oct 2025 1:23 PM ISTపాన్ఇండియా స్టారైనా జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి షూటింగ్ కు ప్యాకప్ చెప్పాక ఫ్యామిలీ మ్యాన్ లా మారిపోతారు. సినిమాల తర్వాత ఎక్కువ టైమ్ కుటుంబానికే కేటాయిస్తారు. భార్య ప్రణతి, పిల్లలతో ఆయన ఫారిన్ ట్రిప్ లకు కూడా వెళ్తుంటారు. కుటుంబానికి ఫస్ట్ ప్రాధాన్యతను ఇస్తానని తారక్ కూడా గతంలో పలుమార్లు చెప్పారు.
తాజాగా ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ పెళ్లి హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లిలో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. లక్ష్మీ శివాని మెడలో నితిన్ మూడు ముళ్లు వేశారు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్- ఆయన భార్య లక్ష్మీ ప్రణతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తారక్- లక్ష్మీ ప్రణతి స్వయంగా అతిథుల్ని ఆహ్వానించారు.
ఈ పెళ్లికి సంబంధించి అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో తారక్ క్రీమ్ అండ్ గోల్డ్ షేడింగ్ కుర్తాలో, గోల్డ్ కోటింగ్ శారీ ప్రణతి కనిపించారు. కొత్త వధూవరులను ఆశ్వీదించారు. నితిన్ శివాని ఇద్దరూ ఒకరికొకరు జీలకర బెల్లం తలపై పెట్టుకుంటుండగా.. తారక్, ప్రణతి కపుల్ కొత్త జంటను ఆశ్వీర్వదించారు. ముఖ్యంగా తారక్ కు సోదరి వరస అయ్యే శివాని తలపై చేయి ఉంచడం అక్కడున్న వారందరినీ ఆకర్షించింది. ఈ ఫొటో సోషల్ మీడియలో వైరల్ అయ్యింది. ఇది పిక్ ఆఫ్ ది డే అంటూ తారక్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
తారక్ - ప్రణతితోపాటు తమ చిన్న కుమారుడు అభయ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. వేడుకకు వచ్చిన వారి కళ్లన్నీ చిన్నారి భార్గవ్ రామ్ పైనే ఉన్నాయి. అతడు చేసే అల్లరి, చిలిపి పనులు, తన అన్నయ్య అభయ్ ను కొట్టడం ఆడుకోవడం అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా పెదనాన్న కల్యాణ్ రామ్ తోనూ భార్గవ్ చేసిన అల్లరి చూడముచ్చటేసింది.
ఈ పెళ్లికి వెక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, రాజీవ్ కనకాలతో సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, లక్ష్మీ శివాని తాళ్లూరి కృష్ణప్రసాద్- స్వరూప దంపతుల కుమార్తె. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడే నార్నే నితిన్. అతడు మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయ్, మ్యాడ్ స్వ్కేర్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు.
