లైనప్ బాగానే ఉంది.. మరి ఆ సినిమా పరిస్థితేంటి?
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్- నీల్ ఇద్దరికీ మాస్ లో మంచి ఇమేజ్ ఉన్న కారణంతో ఎన్టీఆర్‌నీల్ సినిమాపై మాస్ లో భారీ అంచనాలున్నాయి
By: Sravani Lakshmi Srungarapu | 15 Aug 2025 5:00 PM ISTరీసెంట్ గా హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెజిఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్- నీల్ ఇద్దరికీ మాస్ లో మంచి ఇమేజ్ ఉన్న కారణంతో ఎన్టీఆర్‌నీల్ సినిమాపై మాస్ లో భారీ అంచనాలున్నాయి.
డ్రాగన్ కోసం తారక్ భారీ మేకోవర్
ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు నీల్. ఈ సినిమా కోసం తారక్ కూడా కెరీర్లో మునుపెన్నడూ లేనంతగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాకు మేకర్స్ డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ లా ఉంటుందని యూనిట్ సభ్యులంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న డ్రాగన్ సినిమా వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
డ్రాగన్ తర్వాత తారక్ ప్లాన్ అదేనా?
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పలు ప్రాజెక్టులను చేయడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాను చేయడానికి రెడీగా ఉన్నారని, త్రివిక్రమ్ మూవీని పూర్తి చేశాక నెల్సన్ డైరెక్షన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
అదే నిజమైతే మరి దేవర2 పరిస్థితేంటని ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. కాగా త్రివిక్రమ్ మొదట వెంకటేష్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వెంకీ సినిమాను పూర్తి చేయగానే త్రివిక్రమ్ తారక్ తో సెట్స్ పైకి వెళ్తారని సమాచారం. ఈ నేపథ్యంలో కచ్ఛితంగా ఉండి తీరుతుంది అని చెప్పిన దేవర2ను తారక్ ఎలా పూర్తి చేస్తారా లేక మరికొంత టైమ్ తీసుకుని దేవర2ను చేస్తారా అనేది చూడాలి.
