Begin typing your search above and press return to search.

తార‌క్ గాయం డ్రాగ‌న్ కి గ‌ట్టి దెబ్బే!

అయితే వైద్య పరీక్షల్లో భుజం గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రిలో సర్జరీ చేయించుకోవాల్సి వ‌స్తోంది.

By:  Srikanth Kontham   |   12 Aug 2026 5:14 PM IST
తార‌క్ గాయం డ్రాగ‌న్ కి గ‌ట్టి దెబ్బే!
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `డ్రాగన్` కు అనూహ్యమైన అడ్డంకులు ఎదుర‌వుతున్నాయా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి తగిలిన చిన్న గాయం సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. దీంతో ఈ సమస్య నేరుగా శస్త్రచికిత్స వరకు వెళ్లడం నందమూరి అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. షూటింగ్ ఆపడం ఇష్టం లేక ఎన్టీఆర్ అప్పట్లో చేతికి స్లింగ్ ధరించి మరీ సాహసోపేతంగా షూటింగ్‌లో పాల్గొన్నారు.

అయితే వైద్య పరీక్షల్లో భుజం గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రిలో సర్జరీ చేయించుకోవాల్సి వ‌స్తోంది. ఈ ఆపరేషన్ కారణంగా తార‌క్ ఇప్పుడు కొన్ని వారాల పాటు పూర్తిగా కెమెరా ముందుకు రావడానికి వీలులేని పరిస్థితి ఏర్ప‌డే ఛాన్స్ ఉంది. ఒక స్టార్ హీరో ఆరోగ్య సమస్యల కారణంగా ఇలాంటి బ్రేక్ తీసుకోవడం చిత్ర యూనిట్‌ను కొంత ఇబ్బందికర ప‌రిస్థితే. ఈ అనూహ్య పరిణామం నేరుగా `డ్రాగన్` సినిమా విడుదల తేదీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొదట ఈ సినిమాను జూన్ నెలలో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు.

కానీ సర్జరీ కారణంగా షూటింగ్ షెడ్యూల్ పూర్తిగా తలకిందులైంది. రెస్ట్ పీరియడ్ ముగిసి తారక్ పూర్తిగా కోలుకుని సెట్స్‌లోకి అడుగు పెట్టడానికి సమయం ప‌డుతుంది. దీంతో అనుకున్న తేదీకి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు అసాధ్యమనే చర్చ ట్రేడ్ వర్గాల్లో జరుగుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పాన్-ఇండియా స్థాయిలో అత్యంత గ్రాండ్ విజువల్స్‌తో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి సంబంధించి ఇంకా కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.

ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ షెడ్యూల్స్ అన్నీ ఎక్క‌డికక్క‌డ నిలిచిపోతాయి. ప్ర‌స్తుతానికి తార‌క్ లేని స‌న్నివేశాలు షూట్ చేయ‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేదు. దీంతో నిర్మాతలు కొత్త విడుదల తేదీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న `డ్రాగన్` ఆల‌స్యం నిరాశ కలిగించేదే! అయినా? తార‌క్ ఆరోగ్యం ..తిరిగ‌తి కోలుకోవడం ప్రస్తుతం అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యమైన అంశం. సర్జరీ విజయవంతంగా ముగిసి తారక్ మునుపటి కంటే మరింత ఎనర్జిటిక్‌గా తిరిగి వచ్చి షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. డైరెక్టర్ .. ప్రొడక్షన్ టీమ్ కూడా ఎలాంటి రాజీ పడకుండా సినిమాను అత్యుత్తమ నాణ్యతతో తీర్చిదిద్దడానికి విరామాన్ని తగిన విధంగా ప్లాన్ చేసుకునే అవ‌కాశం ఉంది.