ఏంటి.. 2026లో తారక్ 'డ్రాగన్' రావడం లేదా?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నారు.
By: M Prashanth | 9 March 2026 4:08 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో.. హై రేంజ్ లో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో మూవీ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే డ్రాగన్ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందేమోనని ఇప్పుడు రూమర్లు వినిపిస్తున్నాయి.
నిజానికి డ్రాగన్ మూవీని 2026 జూన్ లో విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. షూటింగ్ షెడ్యూల్ ను కూడా అదే ప్రకారం ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇష్యూస్ సినిమా పనులకు అడ్డంకిగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆగిపోయినట్లు సమాచారం.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా ఎడారి నేపథ్యంలో సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వాటిని జోర్డాన్ దేశంలోని ఎడారి ప్రాంతాల్లో చిత్రీకరించాలని భావించారట. ఇప్పటికే అక్కడ ఒక చిన్న షెడ్యూల్ ను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ విజన్ కు తగ్గట్టుగా ఇంకా కొన్ని సన్నివేశాలను ఇక్కడ షూట్ చేయాల్సి ఉందని సమాచారం.
కానీ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ షూటింగ్ చేయడం మేకర్స్ కు పాజిబుల్ అవ్వడం లేదట. కొన్ని సెక్యూరిటీ సమస్యలతోపాటు జర్నీ లిమిట్స్ కూడా ఉండటంతో మేకర్స్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఎడారి సన్నివేశాలను ఎక్కడ చిత్రీకరించాలనే దానిపై వేరే లొకేషన్స్ ను పరిశీలిస్తున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
ఆఫ్రికాలోని కొన్ని దేశాలు, అలాగే ఇతర ఎడారి ప్రాంతాలు షూటింగ్ కు సెట్ అవుతాయా అనే దానిపై మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే కొత్త లొకేషన్స్ ఫిక్స్ చేయడం, అక్కడ అనుమతి పొందడం, కొత్తగా షూటింగ్ ప్లాన్ చేయడం వంటి ప్రాసెస్ లకు సమయం పట్టే అవకాశముంది. అందుకే సినిమా 2026లో రిలీజ్ అవ్వదేమోనని ఇప్పుడు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ పరిస్థితులు చూస్తే మాత్రం.. జూన్ లో డ్రాగన్ విడుదల కావడం కష్టమేనని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏంటి ఇంకా లేట్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా పోస్ట్ పోన్ విషయంపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో అంతా క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా డ్రాగన్ మూవీ.. థియేటర్స్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్నది వేచి చూడాలి.
