Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ డ్రాగన్‌... పిచ్చెక్కించే ప్రశాంత్‌ వ్యాఖ్యలు

ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మార్కెట్‌లో భారీ వసూళ్లు సాధిస్తున్న యాక్షన్‌ సినిమాల పంథాలోనే ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందని ఇటీవల విడుదలైన ఎన్టీఆర్‌ లుక్‌, ఆయన పాత్ర గ్లిమ్స్ చెప్పకనే చెబుతున్నాయి.

By:  Ramesh Palla   |   1 July 2026 12:53 PM IST
ఎన్టీఆర్‌ డ్రాగన్‌... పిచ్చెక్కించే ప్రశాంత్‌ వ్యాఖ్యలు
X

ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ 'డ్రాగన్‌'. కేజీఎఫ్‌, సలార్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ అంచనాలు మరింతగా పెంచే విధంగా దర్శకుడు ఇటీవల ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన వీడియో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆకట్టుకునే కథ, కథనంతో పాటు భారీ యాక్షన్‌ సీన్స్‌ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మార్కెట్‌లో భారీ వసూళ్లు సాధిస్తున్న యాక్షన్‌ సినిమాల పంథాలోనే ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందని ఇటీవల విడుదలైన ఎన్టీఆర్‌ లుక్‌, ఆయన పాత్ర గ్లిమ్స్ చెప్పకనే చెబుతున్నాయి.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో...

డ్రాగన్‌ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎక్కువ లీక్‌లు ఇవ్వడం లేదు. కానీ ఆయన అంచనాలు భారీగా పెంచే విధంగా ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన సినిమా కథ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రశాంత్‌ నీల్‌ తాజా చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ డ్రాగన్‌ సినిమా కథను చెప్పేందుకు ఎన్టీఆర్‌ ను అయిదు ఏళ్ల క్రితం కలిశాను అని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు కథ చెప్పినప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకోలేక కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. కచ్చితంగా అది చాలా కఠినమైన నిర్ణయం అని నాకు కూడా తెలుసు. అందుకే ఎన్టీఆర్‌ నిర్ణయం ఎలా ఉంటుందా అని చాలా టెన్షన్‌ పడ్డాడు. ఎందుకంటే కథలో హీరో పాత్ర అత్యంత భయంకరంగా ఉంటుంది. అత్యంత క్రూరంగా, సాధారణ జనాలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఆ పాత్ర ఉంటుంది కనుక ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా అనే అనుమానం కలిగిందని ప్రశాంత్‌ చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌కు కథ చెప్పిన సమయంలో...

కథలో రక్తపాతం ఎక్కువ అంతే కాకుండా పాత్ర క్రూరత్వం గురించి తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. అలాంటి పాత్రను ఎన్టీఆర్‌కు చెప్పడం అంటే కచ్చితంగా సాహసం అని చెప్పాలి. అయినా కూడా ఎన్టీఆర్‌ చాలా కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని ప్రశాంత్‌ నీల్‌ చెప్పుకొచ్చాడు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు ప్రేక్షకులు గొప్ప సినిమాను ఎక్స్‌పీరియన్స్‌ చేయబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం డ్రాగన్‌ సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్‌ జరుపుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సినిమా ఆలస్యం అయినా కొద్ది అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. దాంతో సినిమాను మరింత మెల్లగా ముందుకు తీసుకు వెళ్తున్నారని యూనిట్‌ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది. డ్రాగన్‌ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో అన్ని ఏరియాల్లోనూ రికార్డ్‌ బ్రేకింగ్‌ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్‌లో అనిల్‌ కపూర్‌...

ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ అనిల్‌ కపూర్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో హిందీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. రుక్మిణి వసంత్‌ సినిమాకు ఫ్రెష్‌ లుక్‌ తీసుకు వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఎన్టీఆర్‌కు జోడీగా ఆమె ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ సినిమాల్లో హీరోయిన్స్‌ కు ఎక్కువ ప్రాముఖ్యత ఉండదు అనే అభిప్రాయం ఉంది. కానీ కథలో వారు చాలా ప్రాధాన్యత ను కలిగి ఉంటారు అనే విషయం తెల్సిందే. ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్‌లో రుక్మిణి వసంత్‌ కి కచ్చితంగా మంచి పాత్ర ఇచ్చి ఉంటాడని, ఆమె తన నటనతో మెప్పిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

2027 జూన్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతాన్ని అందించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈయన సంగీతంతో మరోసారి తెలుగు ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ అవుతారనే నమ్మకాన్ని యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ చాలా పెద్ద సాహసం చేస్తున్న నేపథ్యంలో డ్రాగన్‌ ఫలితం ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.