Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డ్రాగన్ కోసం భారీ సెట్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్.

By:  Madhu Reddy   |   20 Aug 2025 11:26 AM IST
ఎన్టీఆర్ డ్రాగన్ కోసం భారీ సెట్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్!
X

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేశారు. మొదట ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత అనిరుద్ మ్యూజిక్, ఎన్టీఆర్ నటన, డాన్స్, సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అటు జాన్వీ కపూర్ అందరూ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచారు. అలా ఈ సినిమా చిన్నగా పుంజుకొని ఏకంగా రూ.600 కోట్ల క్లబ్లో చేరి కమర్షియల్ హిట్ అందుకుంది.

డ్రాగన్ మూవీ నుండి అప్డేట్..

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రముఖ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా ప్రకటించారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఒకవైపు చేస్తూనే.. మరొకవైపు బాలీవుడ్లో హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ కథానాయికగా వచ్చిన 'వార్ 2' సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసి.. ఇందులో విలన్ పాత్ర పోషించారు. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ కు పెద్దగా ఉపయోగపడలేదని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ బాటలోనే ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ కి వెళ్లి చేతులు కాల్చుకున్నారు అని నెటిజన్లు కూడా కామెంట్లు చేశారు.

డ్రాగన్ కోసం రూ.15 కోట్ల ఖర్చుతో భారీ సెట్..

దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ మూవీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మొదటి షెడ్యూల్ ఉత్తర కన్నడలోని కుంటాలోని కొంకన్ తీరం వెంబడి భారీ ఫ్యాక్టరీ సెట్ ఏర్పాటు చేయాలి అని ప్లాన్ వేశారు. ఈ సెట్ ఎప్పుడో నిర్మించాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో చిత్ర బృందాన్ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీకి తరలించాల్సి వచ్చింది. ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో దాదాపు రూ.15 కోట్ల ఖర్చుతో ఒక మ్యాన్షన్ హౌస్ నిర్మించారని సమాచారం. క్యూరీటెడ్ కళాఖండాలు, కష్టంవాల్ హ్యాంగింగ్లతో పాటు క్లిష్టమైన రంగుల ప్యాలెట్ తో ఈ ఇంటిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినట్లు సమాచారం.

వినాయక చవితి తర్వాత షూటింగ్ ప్రారంభం..

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వినాయక చవితి సందర్భంగా షూటింగ్ కి విరామం ఇచ్చారని, వినాయక చవితి పూర్తయిన వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నెలలో హైదరాబాదులో జరిగే షెడ్యూల్లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో నెల రోజులపాటు చిత్రీకరించనున్నారట. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం. పైగా ఈ డ్రాగన్ సినిమా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ చిత్రాలలో ఒకటిగా రూపుదిద్దుకుంటుంది అని మేకర్స్ కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో శ్రద్ధ కపూర్, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.